AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mustard Benefits : ఆవాలు తింటే ఇన్ని లాభాలా..? తెలిస్తే మాత్రం అసలు వదిలిపెట్టరండోయ్..!

ప్రతి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో అతి ముఖ్యమైనది ఆవాలు కూడా ఒకటి. ప్రతి రోజూ దాదాపు అన్ని వంటకాల్లో ఆవాలను వినియోగిస్తుంటారు. ఆవాలు కూరలకు చక్కటి వాసనను కలిగిస్తాయి. కేవలం వాసన మాత్రమే కాదు..ఆవాలలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Oct 13, 2024 | 8:34 PM

Share
ఆవాలు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. క్రమం తప్పకుండా ఆవాలని తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలున్నా దూరం పెట్టొచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఆవాల్లో పొటాషియం, కాల్షియంలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల ఆరోగ్యానికి, కీళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది.

1 / 5
ఆవాల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆవాలు తీసుకోవడం వల్ల బీపి కంట్రోల్‌ అవుతుంది. అంతేకాకుండా శరీరంలో మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. వీటన్నింటి కారణంగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది. గుండె ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

2 / 5
ఆవాల్లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. ఆవాలు తీసుకోవడం వల్ల థైరాయిడ్ పనితీరు సరిగ్గా ఉంటుంది. థైరాయిడ్ జీవక్రియకి హెల్ప్ అవుతుంది. కాబట్టి, ఆవాలు, ఆవపిండి, ఆవనూనెని డైట్‌లో కచ్చితంగా యాడ్ చేసుకునేలా చూడండి.

3 / 5
ఆవాల్లో కొన్ని గుణాలు క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయి. దీంతో కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఆవాల్లో రిచ్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి మీ చర్మం మెరిసేలా చేయడమే కాకుండా జుట్టుకు బలాన్నిస్తాయి. ఆవాల్లోని విటమిన్ ఎ, కె, సిలు.. వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయి.

4 / 5
ఆవాల్లో ఫినోలిక్ కాంపౌండ్స్, టోకోఫెరోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్ని గుణాలు ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి కాలేయ పనితీరుని మెరుగ్గా చేస్తుంది. వీటితో పాటు జీర్ణ సమస్యల్ని కూడా ఆవాలు దూరం చేస్తాయి.

5 / 5
Follow Us