- Telugu News Photo Gallery Cinema photos Megastar Chiranjeevi and Nagarjuna went Dasara Celebrations In Kerala
Chiranjeevi – Nagarjuna: దసరా సంబరాల్లో చిరంజీవి, నాగార్జున.. సంతోషంలో ఫ్యాన్స్.. ఫోటోస్ వైరల్..
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను ఫిదా చేశారు. ఆదివారం వీరిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. దీంతో ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటూ నెట్టింట ఆరా తీశారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి దసరా సంబరాల్లో పాల్గొన్న ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Updated on: Oct 13, 2024 | 8:46 PM

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను ఫిదా చేశారు. ఆదివారం వీరిద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కేరళ వెళ్లారు. దీంతో ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారంటూ నెట్టింట ఆరా తీశారు ఫ్యాన్స్.

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి దసరా సంబరాల్లో పాల్గొన్న ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరిద్దరూ కలిసి కేరళలోని త్రీశూర్ లో కళ్యాణ్ జ్యువెల్లర్స్ అధినేత టీ.ఎస్. కళ్యాణరామన్ ఆహ్వానం మేరకు దసరా సంబరాల్లో పాల్గొన్నారు.

త్రిశూర్ లో దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయని, ఈ క్రమంలోనే తమ ఇంట్లో జరిగే దసరా వేడుకలకు రావాలంటూ కళ్యాణ్ జ్యువెల్లర్స్ అధినేత ప్రత్యేక ఆహ్వానం పంపడంతో ఇద్దరూ వెళ్లారు.

టీ.ఎస్. కళ్యాణరామన్ కుటుంబంతో కలిసి దిగిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత చిరంజీవి, నాగార్జున ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది. ఇక నాగార్జున కుభేర సినిమాతోపాటు రజినీ నటిస్తోన్న కూలీ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.




