- Telugu News Photo Gallery Cinema photos Guess The Actress in This Photo She Is Heroine Shivathmika childhood Photos
Tollywood: ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. తల్లిదండ్రులు ఇద్దరూ స్టార్స్.. ఎవరో తెలుసా..
ఆకుపచ్చ పట్టు పరికిణిలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. అందం.. అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్.
Updated on: Oct 13, 2024 | 7:56 PM

ఆకుపచ్చ పట్టు పరికిణిలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది. అందం.. అభినయంతో చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్. తనే హీరోయిన్ శివాత్మిక.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాజశేఖర్ గారలపట్టి. దొరసాని సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది.

ఆ తర్వాత రంగమార్తాండ, బ్రహ్మనందం పంచతంత్రం వంటి చిత్రాల్లో నటించి అలరించింది. ఇటు తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ దక్షిణాదిలో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంటూ స్టార్ డమ్ సొంతం చేసుకుంటుంది.

ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోస్.. ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ నెట్టింట్లో రచ్చ చేస్తుంటుంది.

తాజాగా ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అందులో ఆకుపచ్చ పట్టు పరికిణిలో ఎంతో ముద్దుగా కనిపిస్తుంది. శివాత్మక, శివాని ఇద్దరూ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెలు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.




