- Telugu News Photo Gallery Cinema photos Interesting Facts Of Nara Rohit To Be Wife Actress Siri Lella
Nara Rohit- Siri Lella: నారా రోహిత్‌తో జీవితం పంచుకోనున్న హీరోయిన్.. సిరి లేళ్ల గురించి ఈ విషయాలు తెలుసా?
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. ప్రతినిధి 2 సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిరి లేళ్లతో కలిసి ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నాడు. ఆదివారం (అక్టోబర్ 13) వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది.
Updated on: Oct 13, 2024 | 6:57 PM

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. ప్రతినిధి 2 సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిరి లేళ్లతో కలిసి ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నాడు. ఆదివారం (అక్టోబర్ 13) వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది.

హీరో నారా రోహిత్ గురించి మనందరికి తెలిసిందే. అయితే సిరి లేళ్ల గురించి చాలా మందికి తెలియదు. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని చాలామంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు

సిరి లెల్లా తెలుగమ్మాయే. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ కూడా చేసింది.

అయితే సినిమాలపై ఆసక్తితో తిరిగి ఇండియాకు వచ్చేసింది. అప్పుడే ప్రతినిధి 2 సినిమా ఆడిషన్స్ జరుగుతుండగా వెళ్లింది. లక్కీగా హీరోయిన్ గా ఎంపికైంది.

ఇక నారా రోహిత్ తో ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. మొదట హీరో తన విషయాన్ని తన పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పాడట. ఆమె అమ్మాయి తరఫు వాళ్లతో మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట.

ఇందుకు సిరి లేళ్ల కుటుంబం కూడా ఒప్పుకోవడంతో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారట. ఈ ఏడాది డిసెంబర్ లోనే రోహిత్- సిరిల వివాహం జరగనుంది.