- Telugu News Photo Gallery Cinema photos Jr.NTR and koratala Siva focus on Devara part 2, Details here Telugu Heroes Photos
Devara part 2: దేవర పార్ట్ 2 పై స్పెషల్ అప్డేట్.. తారక్ ప్లాన్ అదిరింది.!
దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ, పార్ట్ విషయంలో మరింత ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అసలు కథ అంతా సీక్వెల్‌లోనే ఉందని చెప్పిన దర్శకుడు, ఈ వరల్డ్‌లోకి మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ వచ్చే ఛాన్స్ ఉందన్న హింట్ ఇస్తున్నారు. ఎవరా స్టార్స్ అనుకుంటున్నారా.? దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
Updated on: Oct 13, 2024 | 4:36 PM

దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు కొరటాల శివ, పార్ట్ విషయంలో మరింత ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అసలు కథ అంతా సీక్వెల్‌లోనే ఉందని చెప్పిన దర్శకుడు,

ఈ వరల్డ్‌లోకి మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ వచ్చే ఛాన్స్ ఉందన్న హింట్ ఇస్తున్నారు. ఎవరా స్టార్స్ అనుకుంటున్నారా.? దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఈ సినిమా సక్సెస్‌తో దర్శకుడు కొరటాల శివ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యారు. తారక్, కొరటాల ఇద్దరి కెరీర్‌లకు కీలకమైన సినిమా కావటంతో ఈ సినిమా సక్సెస్‌ను కూడా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

దేవర సక్సెస్ తరువాత వరుసగా మీడియాతో మాట్లాడుతున్న కొరటాల శివ, పార్ట్ 2 మీద అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు కథ అంత సీక్వెల్‌లోనే ఉంటుందని, తొలి భాగంలో చూసింది 10 శాతమే అంటూ హైప్ పెంచేశారు.

లేటెస్ట్ ఇంటర్వ్యూలో సీక్వెల్‌కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు కెప్టెన్ కొరటాల. రెండో భాగంలో కీలకమైన గెస్ట్ రోల్స్ ఉన్నాయని, ఆ పాత్రల్లో టాప్ స్టార్స్ నటిస్తే బాగుంటుందన్నారు.

అంతేకాదు ఆ రోల్స్‌లో రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ చేస్తే బాగుంటుదని తనకు అనిపిస్తుందని, కానీ ఈ కాంబో సెట్ అవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. ప్రజెంట్ బ్రేక్‌లో ఉన్న దేవర టీమ్ మరో నెల రోజుల తరువాత సీక్వెల్ వర్క్‌ను షూరు చేసే ఆలోచనలో ఉంది.

తొలి భాగంగా బ్లాక్ బస్టర్ కావటంతో మరోసారి పార్ట్ 2 స్క్రిప్ట్ ఫైన్ ట్యూన్ చేశాకే షూటింగ్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.




