- Telugu News Photo Gallery Cinema photos Heroine Pooja Hegde Upcoming Movies List and Suriya 44 Movie, Details here Telugu Actress Photos
Pooja Hegde: తగ్గితే తప్పేంటంటున్న బుట్టబొమ్మ.! ఇంకా పూజ కష్టాలు తీరలేదా.?
ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో కనిపించిన పూజా హెగ్డే సడన్‌గా స్లో అయ్యారు. అవకాశాలు తగ్గిపోవటం, వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవటంతో అమ్మడి కెరీర్ కష్టాల్లో పడింది. మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి ఫామ్‌లోకి వస్తున్న ఈ బ్యూటీ, అప్ కమింగ్ సినిమాల విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ నిర్ణయం అమ్మడికి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతోంది.
Updated on: Oct 13, 2024 | 4:36 PM

ఆ మధ్య సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో సూపర్ ఫామ్‌లో కనిపించిన పూజా హెగ్డే సడన్‌గా స్లో అయ్యారు. అవకాశాలు తగ్గిపోవటం, వచ్చిన అవకాశాలు కూడా చేజారిపోవటంతో అమ్మడి కెరీర్ కష్టాల్లో పడింది.

మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి ఫామ్‌లోకి వస్తున్న ఈ బ్యూటీ, అప్ కమింగ్ సినిమాల విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు. ఈ నిర్ణయం అమ్మడికి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతోంది.

రాధేశ్యామ్ రిలీజ్‌కు ముందు కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నారు పూజా హెగ్డే. కానీ ఆ సినిమా ఫెయిల్యూర్ అరవింద ఆశలు ఆవిరి చేసేసింది.

రాధేశ్యామ్ సూపర్ హిట్ అయితే పాన్ ఇండియా హీరోయిన్‌గా బిజీ అవ్వొచ్చని భావించిన బుట్టబొమ్మకు షాక్ తగిలింది. భారీ ఆశలు పెట్టుకున్న భాయ్ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యింది.

దీంతో నార్త్‌లోనూ పూజ కెరీర్‌కు బ్రేకులు పడ్డాయి. కెరీర్ కష్టాల్లో ఉన్న టైమ్‌లో నార్త్‌లో దేవా సినిమా అవకాశం రావటంతో ఊపిరి పీల్చుకున్నారు బుట్టబొమ్మ. తాజాగా సౌత్‌లో కూడా క్రేజీ ఆఫర్స్ పూజ హెగ్డే కిట్టీలో చేరుతున్నాయి.

సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్న సినిమాలో పూజానే హీరోయిన్‌గా ఫిక్స్ చేసింది యూనిట్. దళపతి విజయ్ చివరి సినిమాలోనూ ఈ బ్యూటీనే హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింది. వరుస అవకాశాలతో పూజ బిజీ అవ్వటం వెనుక బిగ్ స్ట్రాటజీ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

గతంలో భారీ పారితోషికం అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు కమిట్ అవుతున్న సినిమాల పేమెంట్ విషయంలో మాత్రం చూసీ చూడనట్టుగా ఉంటున్నారట. అందుకే పూజను హీరోయిన్‌గా తీసుకునేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు మేకర్స్.




