- Telugu News Photo Gallery Cinema photos Tollywood Hero Rana Daggubati Craze in Pan India Movies, Telugu Heroes Photos
Rana Daggubati: పాన్ ఇండియా మార్కెట్‌లో మన రానా మార్క్.! ఇండస్ట్రీ కి వర్త్ వర్మ వర్త్..
దాదాపు రెండేళ్ల తరువాత వెండితెర మీద లెంగ్తీ రోల్‌లో కనిపించారు హీరో రానా. వేట్టయన్ సినిమాతో రజనీకాంత్‌ను ఢీ కొనే ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ రోల్‌లో వావ్ అనిపించారు. ఈ సినిమా చూశాక రానా తన కెరీర్‌లో బిగ్ టర్న్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న డిస్కషన్ జరుగుతోంది. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రానా మొదట్లో హీరోగానే ఎక్కువ సినిమాలు చేశారు.
Updated on: Oct 13, 2024 | 12:49 PM

దాదాపు రెండేళ్ల తరువాత వెండితెర మీద లెంగ్తీ రోల్‌లో కనిపించారు హీరో రానా. వేట్టయన్ సినిమాతో రజనీకాంత్‌ను ఢీ కొనే ప్రతినాయకుడిగా పవర్ ఫుల్ రోల్‌లో వావ్ అనిపించారు.

ఈ సినిమా చూశాక రానా తన కెరీర్‌లో బిగ్ టర్న్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న డిస్కషన్ జరుగుతోంది. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రానా మొదట్లో హీరోగానే ఎక్కువ సినిమాలు చేశారు.

ఆ తరువాత ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించినా.. తన మెయిన్ టార్గెట్ మాత్రం హీరోనే అని క్లారిటీగా చెప్పారు. కానీ బాహుబలి ఆ లెక్కలు మార్చేసింది.

బాహుబలి సినిమాలో ప్రతినాయకుడిగా రానా నటనకు ఇండియన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. బాహుబలిని ఎదిరించే కటౌట్ అంటే ఇలాగే ఉండాలి అనిపించారు రానా.

ఆ మూవీ రిలీజ్ టైమ్‌లో రానా ఇక విలన్ రోల్స్‌కు టర్న్ అవుతారా? అన్న చర్చ జరిగింది. కానీ రానా మాత్రం తన మెయిన్ ప్రిఫరెన్స్ హీరో క్యారెక్టర్స్ కే అని క్లారిటీ ఇచ్చేశారు.

ఇప్పుడు వేట్టయన్‌లో రానా ప్లే చేసిన క్యారెక్టర్ మరోసారి రానా మూవీ సెలక్షన్ గురించి డిస్కషన్‌కు తెర లేపింది. ఈ సినిమాలో స్టైలిష్ విలన్‌గా ఆకట్టుకున్నారు రానా.

దీంతో పాన్ ఇండియా మూవీస్‌కు భల్లాలదేవ, విలన్‌గా మరో బెస్ట్ ఆప్షన్ అంటున్నారు క్రిటిక్స్. మరి ఈ విషయంలో రానా ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.




