ఎత్తైన కొండపై నుంచి బోల్తా పడిన కారు.. ఇద్దరు యువకులు మృతి..

వాహనంలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరణించిన యువకులను వాహనం డ్రైవర్‌ అజయ్‌, అతని సహచరుడు విశాల్‌గా గుర్తించారు. కాగా, కారులో ఉన్న మూడో యువకుడిని కపిల్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడికి

ఎత్తైన కొండపై నుంచి బోల్తా పడిన కారు.. ఇద్దరు యువకులు మృతి..
Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 13, 2024 | 7:16 PM

హిమాచల్‌లోని సిమ్లాలో శనివారం అర్థరాత్రి కారు కొండపై నుంచి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీకి తరలించారు. కొండపై నుంచి కింద పడిన కారు ఓ భవనంలో ఇరుక్కుపోయినట్లు సమాచారం. మృతులను అజయ్( 27), విశాల్‌ (27)గా పోలీసులు గుర్తించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సిమ్లాలోని చక్కర్ సమీపంలో శనివారం అర్థరాత్రి ప్రమాదం జరిగినట్లు ఎస్పీ సిమ్లా సంజీవ్ గాంధీ తెలిపారు. ఈ ప్రమాదంలో కారు కచ్చి ఘాటి నుంచి లింక్‌ రోడ్‌ చక్కర్‌ కోర్టు వరకు పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, ఒక యువకుడు గాయపడ్డాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వాహనంలో ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరణించిన యువకులను వాహనం డ్రైవర్‌ అజయ్‌, అతని సహచరుడు విశాల్‌గా గుర్తించారు. కాగా, కారులో ఉన్న మూడో యువకుడిని కపిల్‌గా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని సిమ్లాలోని ఐజిఎంసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతున్నాడు. అదే సమయంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..