Local Train: పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. 24గంటల వ్యవధిలో వరుసగా మూడో రైలు ప్రమాదం..!
కురుక్షేత్ర-ఖజురహో మధ్య నడిచే గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఛతర్‌పూర్ జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలోని ఇషానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా....
ముంబైలో లోకల్ ట్రైన్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అక్టోబర్ 13 ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ ట్రైన్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పశ్చిమ రైల్వే డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ సంఘటన మధ్యాహ్నం 12:10 గంటలకు జరిగిందని డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ తెలిపారు. ముంబై సెంట్రల్ నుంచి కార్ షెడ్‌లోకి వెళ్తుండగా ఖాళీగా ఉన్న ఈఎంయూ రేక్‌కు చెందిన రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు ప్రకటించారు. బోగీలు పట్టాలు తప్పడంతో సబర్బన్ సేవలకు అంతరాయ కలిగిందన్నారు.
ముంబై సెంట్రల్ కార్ షెడ్‌లోకి ప్రవేశిస్తుండగా ఖాళీగా ఉన్న లోకల్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో పశ్చిమ రైల్వేలో కార్యకలాపాలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన మధ్యాహ్నం 12:10 గంటలకు జరిగిందని డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ తెలిపారు. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు లేకపోవడంతో ఎలాంటి గాయాలు కాలేదని ఆయన స్పష్టం చేశారు. పట్టాలు తప్పడంతో సబర్బన్ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. దాదర్ వైపు స్లో ట్రాక్ బ్లాక్ చేయబడింది. కార్యకలాపాలను నిర్వహించడానికి, రైళ్లను చర్చిగేట్, ముంబై సెంట్రల్ మధ్య ఫాస్ట్ లైన్‌కు మళ్లిస్తున్నట్లు పశ్చిమ రైల్వే ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొంది.
గత 24గంటల వ్యవధిలోనే దేశంలో వరుసగా మూడు రైలు ప్రమాద ఘటనలు చోటు చేసుకోవటం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అక్టోబర్ 13 ఆదివారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. కురుక్షేత్ర-ఖజురహో మధ్య నడిచే గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఛతర్‌పూర్ జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలోని ఇషానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోకి రాగానే ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. వారు మంటలను ఆర్పివేశారు.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
Two coaches of one EMU empty rake derailed while entering the Mumbai Central carshed At around 12:10 hrs.
The slow track from Churchgate to Mumbai Central is held up, and trains are being diverted to fast line between Churchgate to Mumbai Central and train operations are…
— Western Railway (@WesternRly) October 13, 2024
అక్టోబర్ 12 శుక్రవారం రాత్రి తమిళనాడులోని చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్స్ రైలును ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించిన రెండు బోగీలు దగ్ధమయ్యాయి. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..