AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌ రైలు ప్రయాణం..! గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును ఢీకొంది. దీంతో13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాద ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగానే తాజాగా..

బాబోయ్‌ రైలు ప్రయాణం..! గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు..భయాందోళనలో ప్రయాణికులు..
Geetha Jayanti Express Train
Jyothi Gadda
|

Updated on: Oct 13, 2024 | 5:35 PM

Share

దేశవ్యాప్తంగా రైలు ప్రమాదాలకు కుట్రలు జరుగుతున్నాయి. గత ఆగస్టు నెల నుంచి దాదాపు 18 ఘటనలు జరిగినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది. మరోవైపు వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన రైలు ప్రయాణం ఇప్పుడు ప్రయాణికుల్ని భయపెడుతోంది. అక్టోబర్‌ 12న తమిళనాడులో భాగమతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో గూడ్స్‌ రైలును ఢీకొంది. దీంతో13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రమాద ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ చేపట్టింది.

ఇదిలా ఉండగానే, మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో మరో రైలు ప్రమాదం కలకలం రేపింది. అక్టోబర్‌ 13 ఆదివారం ఉదయం గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లో మంటలు చెలరేగాయి. కురుక్షేత్ర-ఖజురహో మధ్య నడిచే గీతా జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులో ఆదివారం మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలోని ఇషానగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించగా.. వారు మంటలను ఆర్పివేశారు.

స్టేషన్‌ మాస్టర్‌ ఆశిష్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం, జరిగిన ప్రమాదంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. వెంటనే మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పారు.. మంటల కారణంగా రైలు దాదాపు గంట ఆలస్యంగా బయలుదేరిందని చెప్పారు. అయితే, కోచ్ దిగువ భాగంలో రబ్బరు వేడెక్కడం వల్ల మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..