పట్టపగలే గూడ్స్ రైల్లో దోపిడీ.. టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు లూటీ.. షాకింగ్ వీడియో వైరల్
పట్టపగలే కొందరు గూడ్స్ రైలును లూటీ చేశారు. ఈ షాకింగ్ దృశ్యాలు చూసిన స్థానికులు హడలిపోయారు. మరి కొందరు ఇదంతా కెమెరాల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వేగంగా వైరల్‌గా మారింది. పగటిపూట దొంగతనం చేయడం వీడియోలో రికార్డైంది. దోపిడీ జరిగిన ఆ ప్రాంతమంతా
అమెరికాలో షాకింగ్ ఘటన జరిగింది. పట్టపగలు కొందరు వ్యక్తులు ఆగివున్న గూడ్స్ రైల్లో దోపిడీకి పాల్పడ్డారు. కార్లు, ట్రక్కులతో వచ్చి రైల్లోని టీవీలు, ఎయిర్ ఫ్రైయ్యర్లు, ఇతర సామాన్లను ఎత్తుకెళ్లారు. చికాగోలోని లేక్, కిన్జీ స్ట్రీట్స్ మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. తుపాకులతో హెచ్చరించడంతో దొంగలు పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
శుక్రవారం మధ్యాహ్నం చికాగో వెస్ట్ సైడ్‌లో ఆగివున్న ఒక సరుకు రవాణా రైలుల్లోకి చాలా మంది చొరబడ్డారు. పట్టపగలే వారు గూడ్స్ రైలును లూటీ చేశారు. ఈ షాకింగ్ దృశ్యాలు చూసిన స్థానికులు హడలిపోయారు. కొందరు కెమెరాల్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వేగంగా వైరల్‌గా మారింది. పగటిపూట దొంగతనం చేయడం వీడియోలో రికార్డైంది. దోపిడీ జరిగిన ఆ ప్రాంతమంతా రణరంగంలా కనిపించింది. అట్టపెట్టలన్నీ చెల్లాచెదరుగా పడ్డాయి. పరిస్థితిని చక్కదిద్ది రైలు సర్వీసును పునరుద్ధరించేందుకు పోలీసులు గంటకు పైనే శ్రమించాల్సి వచ్చింది.
ఈ వీడియో చూడండి..
BREAKING: Thieves rob a train in Chicago, Illinois, taking dozens if not hundreds of boxes off of the stopped freight train.
“UPW inbound and outbound trains are stopped near Kedzie due to police activity,” Metra reported.
Police arrived and were seen pulling out their weapons… pic.twitter.com/tiNYQF1qFn
— Collin Rugg (@CollinRugg) October 11, 2024
కాగా, దోపిడీకి పాల్పడిన వారిలో నలుగురిని గుర్తించిన పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలిపారు. ఎత్తుకుపోయిన సొత్తులో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. దీనిపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.