Andhra Pradesh: విజయవాడ కనకదుర్గమ్మ హంస వాహనసేవ రద్దు.. కారణం ఏంటంటే..
అయితే, అమ్మవారి జలవిహారం రద్దు కావటంతో ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేలా దృష్టి పెట్టింది నిర్వాహణ యంత్రాంగం.. అందులో భాగంగా దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రేపు శనివారంతో దసరా నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి రోజు నిర్వహించే దుర్గమ్మ అమ్మవారి హంస వాహనం సేవను నిర్వాహకులు రద్దు చేశారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరగడం, 40 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండటంతో హంస వాహన సేవ రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ప్రకటించారు.
రేపు (శనివారం)వరద ప్రవాహం తగ్గితే సేవలు తిరిగి కొనసాగిస్తామన్నారు. దుర్గా ఘాట్ వద్ద గంగా సమేత దుర్గా మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ వీడియో చూడండి..
అయితే, అమ్మవారి జలవిహారం రద్దు కావటంతో ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసేలా దృష్టి పెట్టింది నిర్వాహణ యంత్రాంగం.. అందులో భాగంగా దుర్గా ఘాట్‌లోని గంగా సమేత శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పనులు చేపట్టారు. దేవాదాయ శాఖతో పాటు నీటి వనరుల శాఖ అధికారుల సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..