AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Shakthi SAT: హైస్కూల్ అమ్మాయిలకు గోల్డెన్‌ ఛాన్స్‌.. చంద్రయాన్‌-4 ఉపగ్రహం తయారీకి శిక్షణ

చంద్రయాన్-4 మిషన్‌కి సంబంధించి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో ముందడగు పడింది.

ISRO Shakthi SAT: హైస్కూల్ అమ్మాయిలకు గోల్డెన్‌ ఛాన్స్‌.. చంద్రయాన్‌-4 ఉపగ్రహం తయారీకి శిక్షణ
Isro Shakthi Sat
Balaraju Goud
|

Updated on: Oct 14, 2024 | 8:51 AM

Share

చంద్రయాన్-4 మిషన్‌కి సంబంధించి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరో ముందడగు పడింది. అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ఏరోస్పేస్‌ స్టార్టప్‌ సంస్థ ‘స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా’.. సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ప్రయోగించేలా ఉపగ్రహాన్ని తయారు చేయడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకుంది.

అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇచ్చేందుకు శక్తిశాట్‌ అనే మిషన్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో.. భాగంగా 108 దేశాలకు చెందిన 12,000 మంది బాలికలకు అంతరిక్ష సాంకేతికతపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికార పోస్టర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఆవిష్కరించనున్నారు. ఈ శక్తిశాట్‌ మిషన్‌ ద్వారా 108 దేశాలకు చెందిన 14 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న 12,000 మంది హైస్కూల్ విద్యార్థినులకు స్పేస్‌ టెక్నాలజీ, పేలోడ్ అభివృద్ధి, వ్యోమనౌక వ్యవస్థల గురించి ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వనున్నారు. బ్రిటన్‌, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాలు ఇందులో భాగస్వామ్యమవుతున్నాయి. శిక్షణ అనంతరం ప్రతి దేశం నుంచి ఒక విద్యార్థిని చొప్పున 108 మందిని ఎంపిక చేస్తారు. వీరికి పేలోడ్‌లు, స్పేస్‌క్రాఫ్ట్ ప్రోటోటైప్‌లను రూపొందించడంలో శిక్షణ ఇస్తారు.

ఇస్రో చంద్రయాన్-4 మిషన్‌లో ఉపగ్రహాన్ని ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ముందు మోడల్‌ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ శక్తిశాట్‌ మిషన్‌ కేవలం మన దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూర్చే సామర్థ్యం కలిగి ఉందని మిషన్‌కు నేతృత్వం వహిస్తున్న కేసన్‌ తెలిపారు. బాలికలను ప్రోత్సహించడం ద్వారా సాధికారతను కల్పించడం, జీవితాలను మార్చే అవకాశాలను అందించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. స్పేస్ కిడ్జ్ ఇండియా ఇప్పటి వరకు 18కి పైగా బెలూన్‌ శాటిలైట్లు, 3 సబ్‌ ఆర్బిటల్ పేలోడ్‌లు, 4 ఆర్బిటల్ ఉపగ్రహాలను ప్రయోగించింది. హైస్కూల్, కాలేజీ విద్యార్థుల సాయంతో ఉపగ్రహాలను ప్రయోగించిన మొట్టమొదటి సంస్థగా గుర్తింపు పొందింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్‌లో పాముల కలకలం..ఇదిగో వీడియో