Watch Video: కర్ణాటకలో కరెంటు బిల్లుల లొల్లి.. వసూలు చేసేందుకు వెళ్లిన లైన్‌మెన్‌పై చెప్పుతో దాడి.. వీడియో
కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య సీఎం ఎంపిక జరిగింది. అయితే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. సిద్ధరామయ్య ఐదు కీలక హామీలను నెరవేరుస్తామంటూ సంతకాలు సైతం చేశారు. ఇదంతా బాగానే ఉన్నా..

కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య సీఎం ఎంపిక జరిగింది. అయితే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే.. సిద్ధరామయ్య ఐదు కీలక హామీలను నెరవేరుస్తామంటూ సంతకాలు సైతం చేశారు. ఇదంతా బాగానే ఉన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఐదు హామీల అమలుకు ఆర్థిక సర్దుబాటుతోపాటు అర్హులైన లబ్ధిదారుల ఎంపిక సవాల్ గా మారింది. ఆ ఐదు హామీలను ఎలా అమలు చేయాలనే దానిపై మార్గదర్శకాలు సిద్ధమవుతున్న తరుణంలో కర్ణాటక రాష్ట్రంలో అధికారులు.. వర్సెస్ ప్రజలు అన్న చందంగా మారింది. ప్రధానంగా.. తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అసలు సమస్య మొదలైంది. ఊర్లలో కరెంటు బిల్లులు చెల్లించేందుకు ప్రజలు నిరాకరిస్తుండటంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. పాత బకాయిలు చెల్లించాలని ఇళ్లకు వెళ్లిన లైన్‌మెన్‌లకు కూడా ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. తరచూ ప్రజలకు, విద్యుత్ శాఖ అధికారుల మధ్య గొడవలు జరుగుతుండటం పెద్ద తలనొప్పిగా మారింది. మొన్నటిదాకా జస్ట్ వాగ్వాదమే.. ఇప్పుడు ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి.. దాడి చేసే స్థాయికి వెళ్లింది.
తాజాగా.. కరెంటు బిల్లు చెల్లించాలని వెళ్లిన లైన్‌మెన్ పై ఓ వ్యక్తి చేశాడు. కొప్పాల్‌లోని కూకనపల్లి గ్రామంలో.. కరెంటు బిల్లు కట్టించుకునేందుకు వచ్చిన లైన్‌మెన్‌ను ఓ వ్యక్తి అసభ్యకరంగా తిట్టడమే కాకుండా చెప్పుతో దాడి చేశాడు. చంద్రశేఖర్ హిరేమఠ్ అనే వ్యక్తి పేరిట ఆరు నెలలకు రూ.9990 కరెంటు బిల్లు వచ్చింది. ఈ నేపథ్యంలో బాకీ చెల్లించాలని చంద్రశేఖర్ ఇంటికి లైన్ మెన్ మంజునాథ్ వెళ్లాడు. ఈ సమయంలో చంద్రశేఖర్ తన బకాయిలు చెల్లించనని స్పష్టంచేశాడు. బకాయిలు చెల్లించాలంటూ లైన్‌మెన్ మంజునాథ్ కోరారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన చంద్రశేఖర్.. లైన్‌మెన్ మంజునాథ్‌పై చెప్పుతో దాడి చేసి అసభ్యకరంగా తిట్టాడు. మంజునాథ్‌పై దాడికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో మునీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో మంజునాథ్‌పై దాడి చేసిన చంద్రశేఖరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత అధికారి ఫిర్యాదు మేరకు.. నిందితుడు చంద్రశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని జెస్కాం సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.




వీడియో చూడండి..
కొప్పల్ జిల్లా కరటగి తాలూకా జమాపురా గ్రామస్థులు ఇంతకుముందు ఇదే కరెంట్ బిల్లు కట్టమంటూ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కరెంటు బిల్లు కట్టేదేలేదంటూ తేల్చి చెప్పారు. కావాలంటే కమర్షియల్ మీటరుకు మాత్రమే బిల్లు అడగాలని లైన్‌మెన్‌తో చెప్పారు. అంతేకాకుండా.. తరచూ తమవద్దకు వచ్చి అడగొద్దంటూ బిల్ కలెక్టర్‌ను హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
