AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trees: రెండు చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా .. ఈ చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు

Sagon Ttrees: ఓ వ్యక్తి చెట్లను నకినందుకు అటవీ శాఖ అధికారులు రూ.1.21 కోట్ల జరిమానా విధించారు. ఏంటి చెట్లు నరికితే అంత జరిమానా ఎందుకు అనుకుంటున్నారా.. అందుకు కారణాలు..

Trees: రెండు చెట్లు నరికినందుకు రూ.1.21 కోట్ల జరిమానా .. ఈ చెట్లకు ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలిస్తే ఆశ్యర్యపోతారు
Subhash Goud
|

Updated on: Apr 30, 2021 | 4:15 PM

Share

Sagon Ttrees: ఓ వ్యక్తి చెట్లను నకినందుకు అటవీ శాఖ అధికారులు రూ.1.21 కోట్ల జరిమానా విధించారు. ఏంటి చెట్లు నరికితే అంత జరిమానా ఎందుకు అనుకుంటున్నారా.. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అయితే ముందే కరోనాతో ఆక్సిజన్‌ కొరత అధికంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సహజమైన ఆక్సిజన్‌ను అందించేందుకు చెట్లు ఎంత అవసరమో తెలిపేందుకు ఈ సంఘటన నిదర్శనం.

రాష్ట్రంలోని భమోరి అటవీ పరిధిలోని సిల్వానీ గ్రామానికి చెందిన ఛోటే లాల్‌ భీలాల అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి 5న రెండు సాగ్వాన్‌ చెట్లను నరికాడు. ఇతను చెట్లను నరికి అక్రమంగా కలపను విక్రయిస్తున్నాడని స్థానికులు అతనిపై అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో భాగంగా మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ అధికారులు నిందితుడిని ఏప్రిల్‌ 26వ తేదీన అరెస్టు చేశారు. చెట్లు నరికినట్లు రుజువు కావడంతో అతడికి రూ.1.21 కోట్ల జరిమానా విధించారు.

ఆ చెట్ల ప్రాధాన్యత ఏమిటి..?

అయితే నిందితుడు నరికిన ఆ రెండు చెట్లు సగటు జీవిత కాలం సుమారు 50 ఏళ్లు ఉంటాయని శాస్త్రీయ పరిశోధనలలో తేలిందని భమోరి ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి మహేంద్రసింగ్‌ తెలిపారు. ఒక సాగ్వాన్‌ చెట్టు 60 లక్షల రూపాయలు విలువ చేసే ప్రయోజనం చేకూరుస్తుందట. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఫారెస్టు రీసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. సాగ్వాన్‌ చెట్టు తన జీవిత కాలంలో 12 లక్షల రూపాయలు విలువ చేసే ఆక్సిజన్‌ అందిస్తుందట. వాయు కాలుష్య నియంత్రణకు, భూసార పరిరక్షణకు, నీటి వడపోతకు సంబంధించి 48 లక్షల రూపాయలు, మొత్తం కలిపి 60 లక్షల రూపాయల ప్రయోజనాలు అందిస్తుందని చెబుతున్నారు. ఆ లెక్కన చూస్తే.. రూ.1.21 కోట్ల రూపాయల ప్రయోజనాలు అందించే ఆ రెండు సాగ్వాన్‌ చెట్లను నరికినందుకు అంత మొత్తాన్ని జరిమానా విధించినట్లు మహేంద్ర సింగ్‌ తెలిపారు.

ఇవీ కూడా చదవండి:

Covid-19 Effect: కరోనా విలయతాండవం.. పోలీసులను బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారి.. కోవిడ్‌తో 42 మంది పోలీసులు మృతి

Corona Vaccine: రాష్ట్రాలను హెచ్చరించిన సుప్రీం కోర్టు.. వ్యాక్సిన్‌ ధరల విషయంలో కేంద్రంపై కీలక వ్యాఖ్యలు

Telangana Night Curfew: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నైట్‌ కర్ఫ్యూ పొడిగిస్తూ ఉత్తర్వులు.. ఎప్పటి వరకు అంటే..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి