Anil Baijal: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజల్‌కు కరోనా పాజిటివ్.. ట్విట్ చేసి వెల్లడించిన ఎల్జీ
Delhi L-G Anil Baijal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో
Delhi L-G Anil Baijal: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ తరుణంలో సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకూ అందరూ కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కూడా కరోనా మహమ్మారి బారినపడ్డారు. స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో బైజల్ సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. స్వల్పంగా వ్యాధి లక్షణాలు ఉన్నాయని అనిల్ బైజల్ తెలిపారు. వ్యాధి లక్షణాలు కనిపించిన నాటినుంచి సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని.. ఇటీవల తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తాను కరోనా మహమ్మారి బారి నుంచి కోలుకునే వరకు ఇంటి నుంచే ఢిల్లీ పరిస్థితులను పర్యవేక్షిస్తానని ట్విట్‌లో వెల్లడించారు. కాగా.. ఎల్జీ బైజల్ కార్యదర్శి అంకితా మిశ్రా బుండేలాకు కూడా కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
I have tested positive for COVID with mild symptoms. Have isolated myself since the onset of symptoms and all those who were in contact with me have been tested. Will continue to function and monitor the situation in Delhi from my residence.
— LG Delhi (@LtGovDelhi) April 30, 2021
ఇదిలాఉంటే.. దేశ రాజధాని ఢిల్లీని కరోనా పట్టిపీడిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. కరోనా కేసులు, మరణాలు తగ్గడం లేదు. కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 24,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 395 మంది మరణించారు. ఢిల్లీలో లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా కేజ్రీవాల్ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Also Read: