Ice Cream Seller murder Case: ఐస్‌క్రీం అమ్ముకునే వ్యక్తి తల నరికి.. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు! ఆ తర్వాత
ఓ చిరు వ్యాపారి సైకిల్‌పై ఐస్ క్రీం అమ్మేందుకు రోజు మాదిరి శనివారం వ్యాపారినికి వెళ్లాడు. ఇంతలో స్థానికుడైన శంకర్ యాదవ్ (50)తో అతడికి వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్రంగా ఆగ్రహించిన శంకర్ యాదవ్ తన వద్ద ఉన్న కొడవలితో ఐస్‌క్రీమ్ అమ్మే వ్యక్తిపై దాడి చేశాడు. అందరూ చూస్తుండగా..

లక్నో, మార్చి 30: ఓ వ్యక్తి తమ వీధిలోకి వచ్చిన ఐస్‌క్రీం వ్యాపారి తల నరికాడు. తెగిన ఐస్‌క్రీం వ్యాపారి తలను ఇంటికి తీసుకెళ్లి.. తాపీగా వంట చేసుకోసాగాడు. ఇది చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో శనివారం (మార్చి 29) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో పర్సవాల్ గ్రామంలో ఐస్‌క్రీం విక్రేత బబ్లూ (25) సైకిల్‌పై ఐస్ క్రీం అమ్మేందుకు రోజు మాదిరి శనివారం వ్యాపారినికి వెళ్లాడు. ఇంతలో స్థానికుడైన శంకర్ యాదవ్ (50)తో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్రంగా ఆగ్రహించిన శంకర్ యాదవ్ తన వద్ద ఉన్న కొడవలితో ఐస్‌క్రీమ్ అమ్మే బబ్లూపై దాడి చేశాడు. అందరూ చూస్తుండగా అతడి గొంతు కోసి తల నరికేశాడు. ఆ తర్వాత నరికిన బబ్లూ తలను చేతిలో పట్టుకుని నేరుగా అదే గ్రామంలోనే తన ఇంటికి వెళ్లాడు. ఆనక తలను ఓ పక్కన పెట్టి.. తాపీగా వంట చేయడం ప్రారంభించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు.. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అర్పిత విజయవర్గియా ఆదేశాల మేరకు సంఘటనా స్థలానికి భారీగా పోలీసులను పంపించారు. ఐస్‌క్రీమ్ వ్యాపారి బబ్లూను హత్య చేసిన శంకర్ యాదవ్ ఇంటిని చుట్టుముట్టారు. పోలీసులు ఇంటి లోపలకు వెళ్లి చూడగా నిందితుడు వంట చేస్తూ కనిపించాడు. అతడి పక్కనే నరికిన బబ్లూ తల కనిపించింది. పోలీసులు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
➡️आईसक्रीम बेचने गए 21 वर्षीय युवक बबलू की निर्मम हत्या, ➡️गाँव में शंकर यादव ने कहासूनी के बाद बाँके से गला काटकर बबलू की कर दी निर्मम हत्या, ➡️हत्या से क्षेत्र में दहशत, ➡️टिकैत नगर थाना क्षेत्र के परसावल गांव का पूरा मामला !#Barabanki @Barabankipolice @Uppolice pic.twitter.com/hUsyQmGRWm
— Hindustan Express | हिन्दुस्तान एक्सप्रेस (@Hindustan_Expr) March 28, 2026
బబ్లూ మృతదేహం, అతడి తలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడికి, హత్యకు గురైన బాధితుడికి మధ్య వాగ్వాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు జరుగుతోంది. కాగా హత్యకు గురైన బాబ్లూకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాజా సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




