AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్.. ముందస్తు చర్యలతో ప్రజలకు రిలీఫ్

పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంధన సంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళనల మధ్య కేంద్రం సంచలన నిర్ణయాలు తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై భారీగా ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడమే కాకుండా.. దేశీయ అవసరాల కోసం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. అసలు దేశంలో ఇంధన నిల్వలు ఎంత ఉన్నాయి? గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న లక్షలాది మంది భారతీయుల పరిస్థితి ఏంటి? అనేది తెలుసుకుందాం..

నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్.. ముందస్తు చర్యలతో ప్రజలకు రిలీఫ్
No Shortage Of Petrol And Diesel In India
Krishna S
|

Updated on: Mar 29, 2026 | 8:19 PM

Share

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా ఇంధన కొరత కలగకుండా.. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత కోసం భారత ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోంది. హోర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగుతున్నప్పటికీ.. భారత్ ముందస్తు సన్నద్ధతతో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సామాన్యుడిపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దేశీయ అవసరాల కోసం డీజిల్‌పై రూ. 21.5, విమాన ఇంధనంపై రూ. 29.5 ఎగుమతి సుంకాన్ని విధించింది. అన్ని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. తగినంత ముడి చమురు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని చోట్ల వదంతుల వల్ల పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరుగుతోంది. నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, భయాందోళనతో కొనుగోళ్లు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా..

ఎల్పీజీ ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం పీఎన్జీ నెట్‌వర్క్‌ను యుద్ధ ప్రాతిపదికన విస్తరిస్తోంది. రెస్టారెంట్లు, హోటళ్లు, హాస్టళ్లకు 5 రోజుల్లోగా పిఎన్‌జి కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కేవలం ఈ నెలలోనే 2.9 లక్షల కొత్త కనెక్షన్లు అందించారు. పైప్‌లైన్ల ఏర్పాటు కోసం భూసేకరణ, అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ వేగవంతమైన ఆమోద ఫ్రేమ్‌వర్క్‌ను అమలులోకి తెచ్చారు.

సముద్ర భద్రత

సముద్ర మార్గాల్లో భారతీయ నౌకల ప్రయాణం సురక్షితంగా సాగేలా రక్షణ మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ డైరెక్టరేట్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. 94,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో వస్తున్న రెండు భారీ నౌకలు ప్రమాదకర ప్రాంతాన్ని దాటి భారత తీరానికి చేరుకుంటున్నాయి. డీజీ షిప్పింగ్ కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తూ ఇప్పటివరకు 942 మంది నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించింది.

విదేశాల్లో ఉన్న భారతీయుల భద్రత

గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 28 నుండి ఇప్పటివరకు సుమారు 5,24,000 మంది భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి వచ్చారు. గగనతలం మూసివేసిన దేశాల నుండి ప్రక్క దేశాల మీదుగా ప్రయాణికులను తరలిస్తున్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది.

Follow Us
వాంఖడేలో ఊరమాస్ ఇన్నింగ్స్‌తో ఇచ్చిపడేశాడుగా
వాంఖడేలో ఊరమాస్ ఇన్నింగ్స్‌తో ఇచ్చిపడేశాడుగా
ఒక్కసారి ఈ బొమ్మిడాయి చేపల పులుసు ట్రై చేస్తే మర్చిపోలేరు
ఒక్కసారి ఈ బొమ్మిడాయి చేపల పులుసు ట్రై చేస్తే మర్చిపోలేరు
వేగంగా బరువు తగ్గాలంటే వాకింగ్‌ vs రన్నింగ్‌ ఏది బెస్ట్?
వేగంగా బరువు తగ్గాలంటే వాకింగ్‌ vs రన్నింగ్‌ ఏది బెస్ట్?
రామ నవమి ఉత్సవం: ధనుస్సు ఆకార శ్రీరాముని థీమ్ పార్క్‌కు పోటెత్తిన
రామ నవమి ఉత్సవం: ధనుస్సు ఆకార శ్రీరాముని థీమ్ పార్క్‌కు పోటెత్తిన
గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం!
గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం!
ఆఫీసులో మిమ్మల్ని వీక్ అనిపించే 5 అలవాట్లు! వెంటనే మానుకోండి
ఆఫీసులో మిమ్మల్ని వీక్ అనిపించే 5 అలవాట్లు! వెంటనే మానుకోండి
నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం..
నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం..
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..