AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు.. మీ రాశి ఇదేనా?

Ketu Transit: కేతువు, సొంత రాశి లేకపోయినా, అశ్విని, మఘ, మూల నక్షత్రాలకు అధిపతిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది మార్చి 29న, కేతువు సింహరాశిలో ఉన్నప్పుడు, మఖ నక్షత్రంలోకి ప్రవేశించబోతుంది. ఈ గ్రహ సంచారం కొన్నింటికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులు తెలుసుకుందాం!

కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు.. మీ రాశి ఇదేనా?
Ketu Transit
Rajashekher G
|

Updated on: Mar 29, 2026 | 8:05 PM

Share

వేద జ్యోతిషశాస్త్రంలో కేతువు ఒక రహస్యమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ గ్రహం పలు కారణాల వల్ల చెడు ప్రభావాలు చూపించడమే కాదు, కొన్ని సందర్భాల్లో మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. కేతువు వల్ల వ్యక్తుల జీవితంలో ఆకస్మిక మార్పులు, రహస్యాలు, వైరాగ్యం వంటి అనుభవాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే, ఎవరైనా జాతకంలో కేతువు బలంగా ఉన్న వారు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇప్పుడు ఆ ప్రభావం గురించి తెలుసుకుందాం.

మేష రాశి..

కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించడంతో మేష రాశి వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందట. ఇది వారికి కొత్త అవకాశాలను తెచ్చి, జీవితంలో పురోగతిని సాధించేందుకు సహాయం చేస్తుంది. వ్యాపారంలో ఉన్న వారికి మంచి లాభాలు కలుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. గతంలో అంగీకరించిన పనులు విజయవంతంగా పూర్తి కావచ్చు. అదనంగా, కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు పుష్కల అవకాశాలు ఉన్నాయి.

సింహ రాశి

కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించడంతో సింహరాశి వారికి ఎంతో శుభం కలుగుతుంది. మఖ నక్షత్రం సింహరాశికి చెందినదే కావడంతో వారికి ఈ కాలంలో మంచి లాభాలు, అభివృద్ధి ఉంటాయి. పాత పెట్టుబడులు కూడా మంచి లాభాలను అందిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెంపు లాంటి అవకాశాలు మెరుగవుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రాబోతుంది. కుటుంబంలో గొడవలు పరిష్కరించబడతాయి.

ధనుస్సు రాశి

కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించడం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా గొప్ప ప్రయోజనాలు వస్తాయి. ఉద్యోగం చేసే వారు ఆఫీసులో కొత్త బాధ్యతలు, పదోన్నతి పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న స్తబ్దత తొలగిపోతుంది. పోటీ పరీక్షలు రాసేవారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరిగి, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

Follow Us
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..
దోమలు కొందరినే ఎందుకు కుడుతాయో తెలుసా..?
దోమలు కొందరినే ఎందుకు కుడుతాయో తెలుసా..?
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..
30 ఏళ్ల వయసులో జీతం, సేవింగ్స్‌ ఎంత ఉండాలి?
30 ఏళ్ల వయసులో జీతం, సేవింగ్స్‌ ఎంత ఉండాలి?
ఎండాకాలంలో సోంపు తింటే ఏమవుతుంది..? మీరు అస్సలు ఊహించలేరు..
ఎండాకాలంలో సోంపు తింటే ఏమవుతుంది..? మీరు అస్సలు ఊహించలేరు..
పనీర్ బిర్యానీ ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం పక్కా
పనీర్ బిర్యానీ ఇలా చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వడం పక్కా