AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం! ఎప్పటి నుంచి అంటే..?

ఏప్రిల్ 20 నుంచి విమానాల్లో 60 శాతం సీట్లను ఉచితంగా అందించాలని DGCA కొత్త నిబంధన విడుదల చేసింది. ఇది ప్రయాణికులకు, ముఖ్యంగా కుటుంబాలకు పెద్ద ఊరట. పక్కపక్కనే సీట్లు లభించే అవకాశం ఉంది. అయితే, ఈ ఆదాయ నష్టాన్ని పూడ్చుకోవడానికి విమానయాన సంస్థలు బేస్ టిక్కెట్ ధరలను పెంచవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం! ఎప్పటి నుంచి అంటే..?
Free Flight Seats
SN Pasha
|

Updated on: Mar 29, 2026 | 8:23 PM

Share

విమాన టికెట్ బుక్ చేసేటప్పుడు సీటు ఎంపిక కోసం అదనంగా చెల్లించాల్సిన పరిస్థితికి త్వరలో ముగింపు పలకనుంది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) తాజా ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 20 నుంచి అన్ని విమానయాన సంస్థలు తమ విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఉచితంగా అందుబాటులో ఉంచడం తప్పనిసరి అవుతుంది. ప్రస్తుతం కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా ఉండగా, మిగిలిన వాటికి రూ.200 నుంచి రూ.2,100 వరకు అదనపు రుసుము వసూలు చేస్తున్నారు.

ఈ మార్పు కోసం మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ మార్చి 18న కీలక నిర్ణయం తీసుకోగా, DGCA మార్చి 20న తన ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌ను సవరించింది. సవరించిన నిబంధనలు 30 రోజుల తర్వాత అమల్లోకి రావడంతో, ప్రయాణికులకు ఇది గణనీయమైన ఉపశమనం ఇవ్వనుంది. ఈ కొత్త నిబంధనలో ముఖ్యంగా కుటుంబాలతో లేదా సమూహాలుగా ప్రయాణించే వారికి ప్రయోజనం ఉంటుంది. ఒకే PNRపై టిక్కెట్లు బుక్ చేసిన ప్రయాణికులకు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాలని DGCA స్పష్టం చేసింది. అలాగే విమానయాన సంస్థలు తమ వెబ్‌సైట్‌లలో సేవా రుసుములు, ఇతర ఛార్జీల వివరాలను పూర్తిగా పారదర్శకంగా చూపాల్సి ఉంటుంది.

అయితే ఈ నిర్ణయంపై విమానయాన రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ (FIA) ప్రకారం, సీటు ఎంపిక ద్వారా వచ్చే ఆదాయం విమానయాన సంస్థలకు కీలకమైనది. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి ప్రధాన సంస్థలు ఈ ఫెడరేషన్‌లో సభ్యులుగా ఉన్నాయి. 60 శాతం సీట్లను ఉచితంగా ఇవ్వాల్సి వస్తే ఆదాయ నష్టం కలుగుతుందని, దీన్ని పూడ్చుకోవడానికి ప్రాథమిక టికెట్ ధరలను పెంచాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నాయి. మొత్తానికి ఈ నిర్ణయం ఒకవైపు ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుండగా, మరోవైపు విమాన ఛార్జీల పెరుగుదలపై కొత్త చర్చకు దారితీస్తోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం!
గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం!
ఆఫీసులో మిమ్మల్ని వీక్ అనిపించే 5 అలవాట్లు! వెంటనే మానుకోండి
ఆఫీసులో మిమ్మల్ని వీక్ అనిపించే 5 అలవాట్లు! వెంటనే మానుకోండి
నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం..
నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం..
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..
దోమలు కొందరినే ఎందుకు కుడుతాయో తెలుసా..?
దోమలు కొందరినే ఎందుకు కుడుతాయో తెలుసా..?
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..