AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌లోని విమానాలన్నీ పాత ఇనుప సామన్లకు వేయాల్సిందేనా? ఎందుకంటే..?

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఇంధన ధరల విపరీత పెరుగుదల కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మూడు వారాల్లో జెట్ ఇంధన ధరలు 150 శాతం పెరిగాయి, సంస్థ మూసివేత ముప్పును ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితులు ప్రయాణికులపై భారం మోపి, విమాన ప్రయాణాలను మరింత ఖరీదుగా మార్చే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌లోని విమానాలన్నీ పాత ఇనుప సామన్లకు వేయాల్సిందేనా? ఎందుకంటే..?
Pia
SN Pasha
|

Updated on: Mar 29, 2026 | 7:11 PM

Share

పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ (PIA) ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఖర్చులు, ముఖ్యంగా విమాన ఇంధన ధరల విపరీత పెరుగుదల కారణంగా ఈ సంస్థ కార్యకలాపాల కొనసాగింపు ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సంస్థ పూర్తిగా మూతపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అధికారిక వివరాల ప్రకారం జెట్ ఇంధనం (JP-1) ధరలు కేవలం మూడు వారాల్లోనే భారీగా పెరిగాయి. మార్చి 1న లీటరుకు రూ.190గా ఉన్న ధర, మార్చి 21 నాటికి రూ.472కి చేరుకుంది. అంటే దాదాపు 150 శాతం పెరుగుదల నమోదైంది. ఇందులో కూడా మార్చి 21న ఒక్కరోజులోనే రూ.84 పెరగడం గమనార్హం. ఈ పెరుగుదలను పెద్దగా ప్రకటించకుండా అమలు చేయడం పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో PIA కన్సార్టియం ఛైర్మన్ ఆరిఫ్‌ హబీబ్‌ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇంధన ధరలు ఇలాగే పెరుగుతూ ఉంటే, సంస్థ కార్యకలాపాలను కొనసాగించడం అసాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. పరిస్థితి అదుపు తప్పితే సంస్థను మూసివేయాల్సి వస్తుందని కూడా పేర్కొన్నారు.

ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అమెరికా, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ ఘర్షణ ప్రపంచ ఇంధన సరఫరా గొలుసును తీవ్రంగా ప్రభావితం చేసి, విమానయాన రంగంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఇక ఈ పరిస్థితుల ప్రభావం ప్రయాణికులపై పడే అవకాశం ఉంది. విమాన సంస్థలు పెరిగిన ఖర్చులను టికెట్ ధరల రూపంలో వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. దీంతో సాధారణ ప్రజలకు విమాన ప్రయాణం మరింత ఖరీదుగా మారే పరిస్థితి ఏర్పడుతోంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us