Mamata Banerjee: కుల గణనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకారం.. అయితే…
దేశంలో కులాల ప్రాతిపదికపై జనాభా లెక్కల సేకరణ జరగాలన్న ప్రతిపాదనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకారం తెలిపారు. అయితే ఇందుకు అన్ని పార్టీలూ దీనిపై ఏకాభిప్రాయానికి రావాలన్నారు.
దేశంలో కులాల ప్రాతిపదికపై జనాభా లెక్కల సేకరణ జరగాలన్న ప్రతిపాదనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకారం తెలిపారు. అయితే ఇందుకు అన్ని పార్టీలూ దీనిపై ఏకాభిప్రాయానికి రావాలన్నారు. అప్పడు తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించాల్సి ఉందని ఆమె చెప్పారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆధ్వర్యాన అఖిల పక్షబృందమొకటి నిన్న ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. బీహార్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కుల గణన జరగాలని కోరింది. తమ రాష్ట్ర అసెంబ్లీలో ఇందుకు సంబంధించి రెండు సార్లు తీర్మానాన్ని ఆమోదించినట్టు కూడా ఈ బృందం వెల్లడించింది. ఈ అంశంపై మరింతగా మాట్లాడేందుకు నిరాకరించిన మమత..ఒక రాష్ట్రానికి..మరో రాష్ట్రానికి సెంటిమెంట్లు వేర్వేరుగా ఉంటాయని.. అందువల్ల మొదట అందరూ దీనిపై ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని చెప్పారు. నితీష్ కుమార్ దీన్ని ప్రస్తావించారు గనుక ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు.
సున్నితమైన ఈ సమస్యపై బీజేపీ నాయకత్వ వైఖరి ఏమిటో స్పష్టంగా తెలియడంలేదు. వివిధ రాష్ట్రాల్లోని ఆయా ప్రాంతీయ పార్టీలు కమలం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. అందువల్ల దీనిపై బీజేపీ ఆచితూచి నిర్ణయం తీసుకోవలసి ఉంది. లోగడ మండల్ కమిషన్ సిఫారసులను కూడా ఈ పార్టీ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది. మళ్ళీ ‘మండల్ రాజకీయాలకు’ ఇది దారి తీయవచ్చునని ఈ పార్టీ భావిస్తున్నట్టు కనబడుతోందంటున్నారు. పైగా వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ తేనె తుట్టెను కదిపితే అది తమ ప్రయోజనాలకు భంగకరం కావచ్చునని కూడా కమలనాథులు భయపడుతున్నట్టు తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Zoo Bans Woman: జూకు వెళ్లి చింపాజీతో ప్రేమలో పడిన ఓ మహిళ.. ఆ మహిళను బ్యాన్ చేసిన అధికారులు.. ఎక్కడంటే
Srisailam Dam: మట్టి పూడిక ప్రమాద ఘంటికలు.. శ్రీశైలం డ్యాం భవితవ్యంపై నిపుణుల ఆందోళన