AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srisailam Dam: మట్టి పూడిక ప్రమాద ఘంటికలు.. శ్రీశైలం డ్యాం భవితవ్యంపై నిపుణుల ఆందోళన

తెలుగు రాష్ట్రాలకు బహుళ ప్రయోజనకారి అయిన శ్రీశైలం డ్యాం భవిష్యత్ పై నీలినీడలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మట్టి పూడిక చేరుతుండటం రాను రాను నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

Srisailam Dam: మట్టి పూడిక ప్రమాద ఘంటికలు.. శ్రీశైలం డ్యాం భవితవ్యంపై నిపుణుల ఆందోళన
Srisailam Dam Water Level
Janardhan Veluru
|

Updated on: Aug 24, 2021 | 10:20 AM

Share

Srisailam Dam: తెలుగు రాష్ట్రాలకు బహుళ ప్రయోజనకారి అయిన శ్రీశైలం డ్యాం భవిష్యత్ పై నీలినీడలు అలుముకున్నాయి. పెద్ద ఎత్తున మట్టి పూడిక చేరుతుండటం రాను రాను నీటి నిలువ సామర్థ్యం తగ్గిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. శ్రీశైలం డాం నీటి నిల్వ సామర్థ్యం ఎంత మేర ఉంది అనేదానిపై తాజాగా అంచనా వేసేందుకు హైడ్రో గ్రాఫిక్ సర్వే అందరిలో గుబులు పుట్టిస్తోంది… సర్వే చేసిన ప్రతిసారి భారీ ఎత్తున నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందటమే ఇందుకు కారణం…

శ్రీశైలం రిజర్వాయర్ లో పూడిక ఎంతమేరకు చేరుకున్నది? జలాశయం లో ఎన్ని టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు? అనే అంశాలపై గత ఐదు రోజులుగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ పర్యవేక్షణలో ముంబైకి చెందిన జియో టెక్నికల్ సర్వీసెస్ బృందం అధ్యయనం చేస్తున్నది. శ్రీశైలం జలాశయం నుంచి సంగమేశ్వరం వరకు 30 రోజుల పాటు ఈ సర్వే నిర్వహించనున్నారు ప్రత్యేకమైన బోట్ లో ఏకో సౌండర్ పరికరాల ద్వారా శబ్దాన్ని జలాశయంలోకి పంపి ఎంత లోతులో పూడిక పెరిగిపోయిందో లెక్కిస్తారు. నిర్మాణ సమయంలో శ్రీశైలం డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 308 టీఎంసీలు. ఆ తర్వాత పూడిక పేరుకుపోవడంతో 1990లో సర్వే చేయగా నీటి నిల్వ సామర్థ్యం 263 టీఎంసీలకు పడిపోయింది. 2011లో సర్వే చేపట్టి పూడిక మరింత పేరుకు పోయినట్లు సిడబ్ల్యూసి ప్రకటించింది. 2009లో భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున పూడిక తో పాటు మట్టి కొట్టుకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం మళ్లీ భారీగా తగ్గిపోయి 215 టీఎంసీలు గా అంచనా వేశారు.

సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యం సర్వే చేయాలి. ఈ నేపథ్యంలో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం జలాశయం నీటి సామర్థ్యం తేల్చే పనులను జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు. ఇంకా ఈ సర్వే మరో పన్నెండు రోజులపాటు కొనసాగనుంది. జలాశయంలో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (డిజిపిఎస్) విధానంలో సర్వే చేయడం ద్వారా ఎంత నీటిని నిల్వ చేయొచ్చు అనేదానిపై సర్వే పనులను ముంబైకి చెందిన జియో సర్వీసెస్ మారిటైం లిమిటెడ్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది.. గత శుక్రవారం నుంచి ఈ పనులు జరుగుతున్నాయి. జలాశయం జల విస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు. బెడ్ లెవెల్ సగటున 500 మీటర్లు.. పూర్తి నీటిమట్టం 885 అడుగులు. జలాశయం జల విస్తరణ ప్రాంతంలో బెడ్ లెవెల్ నుంచి 885 అడుగుల వరకు….. ఏ మట్టం వద్ద ఎంత నీరు నిల్వ ఉంటుంది అన్నది పడవల ద్వారా అకౌస్తిక్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్.. ఏ డి సి పి.. ఈ పరికరాన్ని ఉపయోగించి తేల్చుతానని హైడ్రాలజీ విభాగం అధికారులు అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీల నుంచి ఎంత మేర తగ్గవచ్చని ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది..

కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అడవులను నరికి వేయడం వల్ల భూమి కోతకు గురై వరదలు తో పాటు మట్టికొట్టుకు వస్తోంది. అందువల్లే శ్రీశైలం జలాశయంలో పూడిక భారీ ఎత్తున పేరుకుపోతున్నది. సర్వే పూర్తయిన వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వే అధికారులు ఒక నివేదిక ఇస్తారు ఈ నివేదిక ఆధారంగా పూడిక మట్టి పేరుకు పోయిన కారణంగా నీటి నిల్వ సామర్థ్యం ఎంత మేర తగ్గింది అనేది ఈ రిపోర్టు లో ఉంటుంది.

(నాగిరెడ్డి, టీవీ9 తెలుగు, కర్నూలు జిల్లా)

Also Read..

Drinking Water: మనం రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి.? ఎక్కువ తాగితే ప్రాణాలకు ప్రమాదమా.?

మారుతీ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా షాక్.. భారీ జరిమానా విధింపు!