AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Drinking Water: మనం రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి.? ఎక్కువ తాగితే ప్రాణాలకు ప్రమాదమా.?

నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని అందరికీ తెలిసిందే. వైద్య నిపుణులు సైతం ఎక్కువగా నీరు తాగాలని సిఫార్సు..

Drinking Water: మనం రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి.? ఎక్కువ తాగితే ప్రాణాలకు ప్రమాదమా.?
Water
Ravi Kiran
| Edited By: Anil kumar poka|

Updated on: Aug 25, 2021 | 8:28 PM

Share

నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని అందరికీ తెలిసిందే. వైద్య నిపుణులు సైతం ఎక్కువగా నీరు తాగాలని సిఫార్సు చేస్తుంటారు. అయితే ఏదైనా కూడా మోతాదుకు మించి చేయకూడదని పెద్దలు అంటారు . నీరు కూడా అంతే.! మోతాదుకు మించి నీళ్లు తాగితే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి అలాంటప్పుడు ఓ వ్యక్తి రోజుకు ఎంత నీరు తాగాలి.? తద్వారా వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి.? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మన శరీరంలో ఎంత నీరు ఉంటుంది..?

నివేదికల ప్రకారం, ప్రతి మనిషి శరీరంలో 65 శాతం వరకు నీరు ఉంటుంది. శరీర బరువులో సగం నీరు శాతం అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 కిలోల బరువు ఉంటే, అందులో 65 కిలోలు నీరు ఉందని అర్ధం చేసుకోవాలి. అయితే వయస్సు రిత్యా నీటి పరిమాణంలో కూడా మార్పులు ఉంటాయి. పెద్దల గురించి మాట్లాడితే.. వారి శరీరంలో 65 శాతం నీరు ఉంటుంది. అలాగే వృద్ధులలో 50 శాతం, పిల్లలలో 80 శాతం ఉంటుంది. ఈ నీరు శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది, ఇది అనేక వ్యాధులను దరి చేరకుండా చేస్తుంది.

ఎంత నీరు అవసరం?

అసలు ఓ వ్యక్తికి రోజుకు ఎంత నీరు అవసరం.? అది తెలుసుకుందాం.!ప్రతీ వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే నీటి పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది. శరీర బరువును బట్టి మీరు నీరు తాగాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తి 20 కిలోల బరువును బట్టి ఒక లీటరు నీటిని తాగాలని అనేక పరిశోధనలలో వెల్లడైంది. ఉదాహరణకు, మీరు 70 కిలోల శరీర బరువు ఉంటే, అప్పుడు 20 కిలోలకు లీటర్ చొప్పున 3.5 లీటర్ల నీరు త్రాగాలి. 80 కిలోలు ఉంటే, 4 లీటర్ల నీరు తాగాలి. యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం, ఒక మహిళ ప్రతిరోజూ 11.5 కప్పుల నీరు తాగాలి. అంటే 2.7 లీటర్లు. అదే సమయంలో, పురుషుడికి 15.5 కప్పుల నీరు అవసరం, అంటే ప్రతిరోజూ 3.7 లీటర్లు తాగాలి.

కాగా, పైన పేర్కొన్న విధంగా ప్రతీ రోజూ ఇంత మోతాదులో నీరు అవసరం అని ధ్రువీకరించలేం. ఆహారం, జీవనశైలి, వాతావరణ మార్పులపై వాటర్ మోతాదు ఆధారపడి ఉంటుంది. ప్రతీ రోజూ తాగే నీళ్ల పరిమాణం.. మీరు ఎక్కడ నివసిస్తున్నారు.? ఏ ఉష్ణోగ్రతలో ఉంటున్నారు.? ఏ వాతావరణంలో జీవిస్తున్నారు.? ఎంత చురుకుగా ఉన్నారు.? మీ ఆరోగ్యం.? గర్భధారణ మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది.

ఇదిలా ఉంటే అతిగా మంచినీరు తాగడం వల్ల శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. అటు గుండె, మూత్రపిండాలు సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తలనొప్పి, వికారం, కండరాల నొప్పులు వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

Read Also : మీరు 50 వేల రూపాయలకంటే ఎక్కువ మొత్తానికి చెక్ ఇస్తున్నారా? అయితే..ఈ నిబంధనలు పాటించాల్సిందే!

సావిత్రి చేతిలో చిన్నారి బాలుడు.. నేడు టాలీవుడ్‌లో స్టార్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా..

జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ 4 ఆహారాలను తరచుగా తినండి..