AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Zoo Bans Woman: జూకు వెళ్లి చింపాజీతో ప్రేమలో పడిన ఓ మహిళ.. ఆ మహిళను బ్యాన్ చేసిన అధికారులు.. ఎక్కడంటే

Zoo Bans Woman:ప్రపంచంలో జంతు ప్రేమికులకు కొదవు లేదు.. పిల్లి, కుక్కలనుంచి పులి పిల్లలను కూడా పెంచుకుంటూ వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి విన్నాం. అయితే కొంతమంది తమ పెంపుడు జంతువులను..

Zoo Bans Woman: జూకు వెళ్లి చింపాజీతో ప్రేమలో పడిన ఓ మహిళ.. ఆ మహిళను బ్యాన్ చేసిన అధికారులు.. ఎక్కడంటే
Chimpanzee
Surya Kala
|

Updated on: Aug 24, 2021 | 10:41 AM

Share

Zoo Bans Woman:ప్రపంచంలో జంతు ప్రేమికులకు కొదవు లేదు.. పిల్లి, కుక్కలనుంచి పులి పిల్లలను కూడా పెంచుకుంటూ వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి విన్నాం. అయితే కొంతమంది తమ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావించి పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తే.. మరికొందరు ఏకంగా.. తమ ఆస్తులను పెంపుడు జంతువులకు రాసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఓ మహిళ తాను వెరీ వెరీ స్పెషల్ అనిపించింది.. జంతువులను చూడడానికి వెళ్లి.. అక్కడ ఉన్న ఓ చింపాజీతో ప్రేమలో పడింది. దీంతో ఆ జూ అధికారులు ఆ మహిళను జూ నుంచి బ్యాన్ అయ్యారు.. ఈ వింత ఘటన బెల్జియంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

బెల్జియంకు చెందిన ఓ మహిళ ‘ఆది టిమ్మర్ మన్స్’ జంతు ప్రేమికురాలు. రెగ్యులర్‌గా ‘జూ’కు వెళ్తుండేది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ‘చిటా’ అనే 38 ఏళ్ల చింపాంజితో ప్రేమలో పడింది. దానికోసం ప్రతీవారం ‘యాంట్ వెర్ప్ జూ’ కు వెళ్లేది. ఆ చింపాంజి కూడా ఈ మహిళ తరచూ జూ కు రావడాన్ని గమనించేది. కొద్దిరోజుల తర్వాత ఇద్దరి మధ్య ఓ కమ్యూనికేషన్ ఏర్పడింది. దీంతో చిటా మరియు టిమ్మర్‌మన్స్ ఒకరినొకరు చూసుకుంటూ.. గ్లాస్ ఎన్ క్లోజర్ ఎదురుగా నిలబడి ‘హాయ్, బాయ్’ చెప్పుకుంటూ ఉండేవారు. సైగలతో సంభాషించుకునే వారు. ఆ తర్వాత చేతులు ఊపుతూ గాల్లో ‘ముద్దులు’ కూడా పెట్టుకునే వారు. ఇలాగే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.

అయితే, నెమ్మదిగా చింపాంజిలో మార్పులు రావడం గమనించిన జూ సిబ్బంది టిమ్మర్ మన్స్‌ను నిలదీశారు. దాంతో మా ఇద్దరి మధ్య ‘ఎఫైర్’ నడుస్తుందని చెప్పింది టిమ్మర్‌మన్స్‌. దీంతో ఆమె మళ్లీ ‘జూ’ కు రాకుండా అధికారులు నిషేధం విధించారు. ఈ విషయంపై జూ అధికారులు స్పందిస్తూ.. జూలో జంతువులపై మనుషులు ఎక్కువ అప్యాయతగా, ప్రేమగా మెలిగినా అవి వింతగా ప్రవర్తిస్తాయని, వారితో తప్ప.. ఇతర జంతువులతో కలిసి ఉండలేవని చెప్పారు. ఇది ఇలాగే కొనసాగితే చిటా పై పెను ప్రభావం చూపుతుందనే కారణంతోనే ఆ మహిళపై నిషేధం విధించినట్టు పేర్కొన్నారు.

Also Read: పిల్లల తల్లైనా స్టార్ హీరోయిన్‌గా ఖ్యాతిగాంచిన అలనాటి మేటి నటి అంజలీదేవి జయంతి నేడు