AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Returns: ఆదాయపు పన్ను పోర్టల్ విషయంలో ఇన్ఫోసిస్‌కు డెడ్‌లైన్  విధించిన కేంద్రం..ఇప్పటివరకూ అంటే..

Income Tax Portal: కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి

IT Returns: ఆదాయపు పన్ను పోర్టల్ విషయంలో ఇన్ఫోసిస్‌కు డెడ్‌లైన్  విధించిన కేంద్రం..ఇప్పటివరకూ అంటే..
It Returns
KVD Varma
|

Updated on: Aug 24, 2021 | 11:14 AM

Share

IT Returns:  ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో సలీల్ పరేఖ్,  ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముందు హాజరయ్యారు. కొత్త ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆయనకు సమన్లు జారీ చేశారు.  సెప్టెంబర్ 15 లోపు అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆర్థిక మంత్రి వారిని కోరారు. కొత్త ఆదాయపు పన్నుకు సంబంధించి  4241 కోట్ల రూపాయలతో ఇన్ఫోసిస్ సిద్ధం చేసిన పోర్టల్ జూన్ 7 నప్రారంభించారు.  అప్పటి నుండి దానితో నిరంతరం సమస్యలు ఉన్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

రెండున్నర నెలల తర్వాత కూడా..

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సలీల్ పరేఖ్‌తో సమావేశమయ్యారు. సమావేశంలో, ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఎదుర్కొంటున్న సాంకేతికసమస్యలపై చర్చించారు.  పోర్టల్ ప్రారంభించి రెండున్నర నెలల తర్వాత కూడా ప్రభుత్వం,  పన్ను చెల్లింపుదారులు నిరంతర సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సలీల్ పరేఖ్‌కి ​​తెలిపింది. దీనిపై సలీల్ పరేఖ్ వివరణ ఇచ్చారు. ఆర్థిక మంత్రి ముందు స్పష్టత ఇచ్చారు. సలీల్ పరేఖ్ పోర్టల్ సరిగ్గా పని చేయడానికి తాను, తన బృందం అన్నివిధాలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో 750 మందికి పైగా బృందం పనిచేస్తోందని, ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు.

ఆగష్టు 21 న పోర్టల్ నిలిచిపోయింది. రిటర్నులు, వాపసులను దాఖలు చేయడానికి సంబంధించిన సమస్యలు పోర్టల్  ప్రారంభమైనప్పటి నుండి వస్తున్నాయి. అదే సమయంలో, ఆగస్టు 21 నుండి 22 వరకు, పోర్టల్ పనిచేయలేదు. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. ఆదాయపు పన్ను వెబ్‌సైట్ పునరుద్ధరించారనీ, దాని సమస్య పరిష్కరించామనీ ఇన్ఫోసిస్ ఆగస్టు 22 న ఆలస్యంగా ప్రకటించింది. ఇన్ఫోసిస్ సోషల్ మీడియా ద్వారా, “ఆదాయపు పన్ను ఇండియా పోర్టల్ అత్యవసర నిర్వహణ పని ముగిసింది. పోర్టల్ ప్రత్యక్షంగాలైవ్ లో  ఉంది. ప్రజలకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాము. ” అని ప్రకటించింది.

పోర్టల్ ప్రారంభించిన దగ్గర నుంచీ వస్తున్న సమస్యలివే..

  • చలాన్ నంబర్ చెల్లదు.
  • డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ (DIN) ఆటో పాపులేషన్ పొందడం లేదు.
  • కొత్త వెబ్‌సైట్‌లో దాఖలు చేసిన TDS రిటర్న్‌లుతిరస్కరణకు గురి అవుతున్నాయి.
  • ఫారం 15CA/CB దాఖలు చేయడం లేదు.
  • వివాద్ సే విశ్వాస్ పథకం టాబ్ పని చేయడం లేదు.
  • రిటర్న్స్ దాఖలు చేయడం లేదు.
  • రీఫండ్ సమస్య అభ్యర్థన దాఖలు చేయడం లేదు.
  • ఆదాయపు పన్ను యొక్క 143 (1) యొక్క ఇంటిమేషన్ ఆర్డర్లు తెరవడం లేదు.
  • ఫారం 3, 5, 6, 7 అందుబాటులో లేదు.

ఈ పోర్టల్ లో తలెత్తుతున్న ఈ లోపాలపై ఇప్పటికే ప్రజలు అనేక ఫిర్యాదులు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పోర్టల్ లో లోపాలు సరిచేయమని ఇన్ఫోసిస్ చెబుతూ వస్తోంది. కానీ, ఇప్పటికీ పోర్టల్ లో లోపాలు సరికాలేదు. సరికదా.. రెండు రోజుల పాటు పోర్టల్ నిలిచిపోయింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఇన్ఫోసిస్ కు డెడ్ లైన్ విధించింది.

Also Read: Maruti Suzuki: మారుతీ కంపెనీకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా షాక్.. భారీ జరిమానా విధింపు!

Nirmala Sitharaman: కేంద్రం మరో సంచలన నిర్ణయం.. నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌