AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాలేగావ్‌ పేలుళ్ల కేసు.. 17 ఏళ్ల తర్వాత NIA కోర్టు సంచలన తీర్పు!

పదిహేడేళ్లక్రితం సంచలనం సృష్టించిన మాలెగావ్‌ పేలుళ్లకేసులో ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితులుగా ఇన్నాళ్లు జైల్లో ఉన్న వ్యక్తులను నిర్దోషులుగా పరిగణిస్తూ కోర్టు విడుదల చేసింది. 17 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత NIA కోర్టు తుది తీర్పును వెలువరించింది.

మాలేగావ్‌ పేలుళ్ల కేసు.. 17 ఏళ్ల తర్వాత NIA కోర్టు సంచలన తీర్పు!
Malegaon Bomb Case
Anand T
|

Updated on: Jul 31, 2025 | 1:15 PM

Share

మాలెగావ్‌ బాంబుపేలుళ్ల కేసులో ముంబై ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది, మాలెగావ్‌ కేసులో ఏడుగురు నిందితులను నిర్దోషులుగా లేల్చుతూ వారిని విడుదల చేసింది. నిందితుల ప్రమేయాన్ని ప్రాసిక్యూషన్‌ నిరూపించలేకపోయిందన్న NIA కోర్టు, సంశయలాభంతో మాలెగావ్‌ బాంబుపేలుళ్ల కేసు నిందితుల విడుదల చేసింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం అనుమానంతో వారిని దోషులుగా నిర్ధారించలేమని న్యాయస్థానం తెలిపింది.

2008 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని మాలెగావ్‌ భికుచౌక్‌ ప్రాంతంలో జరిగిన బాంబుపేలుడులో టూవీలర్‌లో అమర్చిన IED బాంబుపేలి ఆరుగురి వ్యక్తులు మృతి చెందారు. సుమారు 101మందికిపైగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసులో బీజేపీకి చెందిన ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్ ప్రధాన నిందితులుగా ఉన్నట్టు తేర్చారు. రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్‌ సహా మరో ఐదుగురు వ్యక్తులను ఈ కేసులో పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు.ఈ కేసులో మొత్తం 220మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారణ ప్రారంభమయ్యేలోపు 26 మంది సాక్షుల మరణించారు. మొదట్లో ఈ కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) దర్యాప్తు చేసింది. అయితే, 2011లో దర్యాప్తును NIAకి అప్పగించారు.

2016లో, NIA కోర్టుకు ఒక ఛార్జ్ షీట్ సమర్పించింది, దీనిలో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌తో పాటు అనేక మంది నిందితులను నిర్దోషులుగా తేల్చింది. కేసులో అనుమానితులుగా ఉన్న వారు దోషులుగా పరిగణించేందుయు తగిన సాక్షాలు లేకపోవడంతో వారిని నిర్ధోషులుగా విడుదల చేస్తున్నట్టు కోర్టు తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
రూ.500 కోట్లు వచ్చినా సేఫ్ కాదా.. ఇదెక్కడి బిజినెస్
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
తన పెళ్లి పై 12రోజుల తర్వాత మౌనం వీడిన స్మృతి మంధాన
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
ఎన్టీఆర్ సినిమాపై మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
రాష్ట్రపతి విందుకు రాహుల్‌కు అందని ఆహ్వానం..కాంగ్రెస్ నుంచి ఆయనకు మాత్రమే..
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో హీరోయిన్లకు తిప్పలు
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
కదలికతోనే కోట్లు కురిపించనున్న రాహు కేతువులు.. మీ రాశి ఉందా?
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
8 గంటలు పని చేయడానికి ఇదేమైనా జాబా.. ఇచ్చి పడేసిన రానా
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయట..
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
రోజూ రాత్రి 2 యాలకులు తింటే.. మీ శరీరానికి సూపర్ పవర్స్..!
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు
ఈ ఫొటోలో దాగి ఉన్న పిల్లిని గుర్తిస్తే.. నిన్ను మించిన తోపుల్లేరు