- Telugu News India News School Holidays in August 2025: School Closed Dates List Here, Check Now For Raksha Bandhan, Independence Day Holiday!
School Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్ట్‌లో పాఠశాలలకు భారీగా సెలవులు!
August School Holidays: ఆగస్టులో భారతదేశం అంతటా చాలా పాఠశాలలు రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, గణేష్ చతుర్థి వంటి వివిధ సందర్భాలలో ముఖ్యమైన సెలవులను పాటిస్తాయి . ఈ సెలవులతో విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి, ఎంజాయ్ చేసేందుకు అద్భుతమైన అవకాశం.
Updated on: Jul 31, 2025 | 12:49 PM

ఆగస్టు నెల విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన నెల అనే చెప్పాలి. ఈ నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఎందుకంటే ఆగస్ట్‌లో రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవ సెలవులు సహా అనేక సెలవులు వస్తాయి. మంచి ప్రణాళికతో, కుటుంబాలు చిన్న పర్యటనలు, లేదా ఇంట్లో విశ్రాంతి సమయం కోసం ఈ విరామాలను అనుకూలంగా ఉండవచ్చు. ఆగస్ట్ నెలలో వరుస సెలవులు వస్తుండటంతో కుటుంభమంతా కలిసి టూర్ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు.ఆగస్టులో భారతదేశం అంతటా చాలా పాఠశాలలు రక్షా బంధన్, స్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి, గణేష్ చతుర్థి వంటి వివిధ సందర్భాలలో ముఖ్యమైన సెలవులను పాటిస్తాయి . ఈ సెలవులతో విద్యార్థులు విశ్రాంతి తీసుకోవడానికి, ఎంజాయ్ చేసేందుకు అద్భుతమైన అవకాశం.

ఆగస్ట్ 8న వరలక్ష్మి వ్రతం: ఇక ఆగస్ట్ నెలలో మొదటి వారం నుండే సెలవులు ప్రారంభం అవుతాయి. ఆగస్ట్ 3న ఆదివారం. ఆ రోజు దేశ వ్యాప్తంగా సాధారణంగా సెలవు ఉంటుంది. తర్వాత ఓ నాలుగురోజులు మాత్రమే పాఠశాలలు, కాలేజీలు, ఆఫీసులు కొనసాగుతాయి. ఆ తర్వాత వరుస సెలవులు రానున్నాయి. ఆగస్ట్ 8 శుక్రవారం వరలక్ష్మి వ్రతం. తెలుగింటి ఆడపడుచులు భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించే పర్వదినం. అందుకే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈరోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చాయి.

ఆగస్ట్ 9న రెండో శనివారం, రాఖీ పండగ: 8న శుక్రవారం వరలక్ష్మి వ్రతం తర్వాతి ఆగస్టు 9న రెండో శనివారం. ఈ రోజు కూడా సెలవే ఉంటుంది. ప్రతి నెలలో రెండో శనివారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అయితే ఆగస్ట్ 9న మరో పండగకూడా ఉందండోయ్. అదే రాఖీ పండగ. ఈ రోజున తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఐచ్చిక సెలవు ఇచ్చాయి. ఆగస్ట్ 10న ఆదివారం: ఆగస్ట్ 10 ఆదివారం- దేశ వ్యాప్తంగా సాధారణంగా సెలవు ఉంటుంది. ఇలా ఆగస్ట్ 8, 9, 10వ తేదీల్లో మూడు రోజుల పాటు వరుస సెలవులు ఉండనున్నాయి.

ఆగస్ట్ 11 నుండి 14 వరకు విద్యార్థులకు జాతీయ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలకు రిహార్సల్స్, ఆటల పోటీలు, ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉంటాయి. పెద్దగా క్లాసులు కూడా కొనసాగవు. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం. ఓ రకంగా చెప్పాలంటే పిల్లలకు ఎంజాయ్ అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు తరగతులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే విద్యార్థులకు సెలవుల తర్వాత ఈ నాలుగు రోజులు కూడా ఆటలు, పాటలు, విద్యాసంస్థల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జాతీయ దినోత్సవ వేడుకల కోసం ఎలాంటి క్లాసులు సరిగ్గా జరగవు. ఇవి కూడా ఒకరకంగా పిల్లలకు క్లాసుల గొడవ ఉండదు. ఎంజాయ్‌గా ఉంటారు.

ఆగస్ట్ 16 సెలవు: ఇక జాతీయ దినోత్సవం తర్వాత శ్రీకృష్ణుడి పుట్టినరోజును కృష్ణాష్టమి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. పిల్లలను కృష్ణుడు, గోపికల వేషధారణలో అలంకరించి ఉట్టికొట్టే వేడుకలు నిర్వహిస్తుంటారు. అందుకే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలు, కాలేజీలు, ఆఫీసులకు సెలవు ఉంటుంది.

వినాయక చవితి: శ్రీకృష్ణాష్టమి తర్వాత మరుసటి రోజు ఆగస్ట్ 17న ఆదివారం. సాధాణంగా సెలవు ఉండేదే. ఇలా చూసుకుంటే వచ్చే నెలలో విద్యార్థులకు సెలవులే.. సెలవులు ఉంటాయి. ఇక ఆగస్ట్ 27న వినాయక చవితి. దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ఉంటుంది.




