Maharashtra: ట్రైన్ అయితే సేఫ్ అనుకుని అవి పట్టుకొచ్చాడు.. కానీ, అక్కడ తేడా కోట్టడంతో సీటీ చిరిగిపోయింది..

ట్రైన్‌లో అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని థానే..

Maharashtra: ట్రైన్ అయితే సేఫ్ అనుకుని అవి పట్టుకొచ్చాడు.. కానీ, అక్కడ తేడా కోట్టడంతో సీటీ చిరిగిపోయింది..
Train
Follow us

|

Updated on: Oct 04, 2022 | 12:52 PM

ట్రైన్‌లో అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తున్న ఓ ప్రయాణికుడిని ఆర్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా టిట్వాలా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. లెక్కల్లో చూపని నగదు, ఏకంగా రూ. 1.71 కోట్ల విలువైన రెండు బంగారు బిస్కెట్లు లభించాయని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. టిట్వాలా రైల్వే స్టేషన్‌లో గణేష్ మోండల్ అనే ప్రయాణికుడు అనుమానాస్పదంగా కనిపించడంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అతన్ని అడ్డగించారు. అతని బ్యాగ్ చెక్ చేయగా, పెద్ద మొత్తంలో నగదు, రెండు బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. నగదు, బంగారానికి లెక్కల చూపాలని కోరాగా పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చాడు. దాంతో ఆర్పీఎఫ్ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బంగారు బిస్కెట్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.

రూ. 56 లక్షల నగదు, రూ. 1,15,16,903 విలువైన రెండు బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు అధికారులు. డబ్బు, బంగారం గురించి ఆరా తీయగా సరైన సమాధానం చెప్పలేదన్నారు అధికారులు. గణేష్ మోండల్ లక్నో నుంచి వచ్చాడి, అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన నగదు, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్  చేయండి..