Good News: సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. తగ్గిన 11 రకాల నిత్యావసర వస్తువుల రేట్లు.. వివరాలివే!
సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సుమారు 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి..

అసలే దసరా సీజన్.. ఆపై నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. సెప్టెంబర్ నెలలో సుమారు 11 రకాల నిత్యావసర వస్తువుల ధరలను మోదీ సర్కార్ తగ్గించింది. ఏయే వస్తువుల ధరలు ఎంత మేరకు తగ్గాయో వివరిస్తూ కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
| నిత్యావసర వస్తువులు | సెప్టెంబర్ 2వ తేదీ | తగ్గింపు శాతం | అక్టోబర్ 2వ తేదీ |
|---|---|---|---|
| పామాయిల్ | రూ. 132 | 11 శాతం | రూ. 118 |
| వనస్పతి నెయ్యి | రూ. 152 | 6 శాతం | రూ. 143 |
| సన్‌ఫ్లవర్ ఆయిల్ | రూ. 176 | 6 శాతం | రూ. 165 |
| సోయాబీన్ ఆయిల్ | రూ. 156 | 5 శాతం | రూ. 148 |
| ఆవనూనె | రూ. 173 | 3 శాతం | రూ. 167 |
| వేరుశెనగ నూనె | రూ. 189 | 2 శాతం | రూ. 185 |
| ఉల్లిపాయ | రూ. 26 | 8 శాతం | రూ. 24 |
| బంగాళదుంప | రూ. 28 | 7 శాతం | రూ. 26 |
| పప్పు దినుసులు | రూ. 74 | 4 శాతం | రూ. 71 |
| మసూర్ దాల్ | రూ. 97 | 3 శాతం | రూ. 94 |
| మినపపప్పు | రూ. 108 | 2 శాతం | రూ. 106 |
కాగా, గ్లోబల్ ధరలు పతనం, దిగుమతి సుంకాలు తగ్గడంతో.. దేశీయంగా ఆహార, చమురు, వంట నూనె ధరలు తగ్గుముఖం పట్టాయని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
त्यौहारों के समय में खाद्य पदार्थों के दामों में गिरावट, घर में उत्सव, बजट में राहत। pic.twitter.com/oklqSiOn3U
— Piyush Goyal (@PiyushGoyal) October 3, 2022
పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకం విధింపు వాయిదా..
ఇథనాల్, బయో డీజిల్ కలపని పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు అదనంగా రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని విధించాలన్న నిర్ణయాన్ని కేంద్రం మరో నెల రోజులు వాయిదా వేసింది. పెట్రోల్‌లో ఇథనాల్, డీజిల్‌లో బయో డీజిల్ కలిపేందుకు పరిశ్రమలకు ఇచ్చిన గడువును పొడిగించింది. ఈ మేరకు సెప్టెంబర్ 30వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో నవంబర్ 1 నుంచి పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకం, డీజిల్‌పై 2023, ఏప్రిల్ 1 నుంచి అదనపు ఎక్సైజ్ సుంకం అమలులోకి రానుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..
