Maharashtra Rains: మహారాష్ట్రలో కొనసాగుతున్న జలవిలయం.. వందల గ్రామాలకు రాకపోకలు బంద్.. వంద మందికి పైగా మృతి
మహారాష్ట్రలో మహావిలయం వచ్చింది. వరుణుడు ఒక్కసారిగి దాడి చేస్తున్నాడు. ఈ జిల్లా, ఆ జిల్లా అని లేదు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా ఒకటే వానలు. జనజీవనం అస్తవ్యస్తమైంది
Maharashtra Heavy Rains: మహారాష్ట్రలో మహావిలయం వచ్చింది. వరుణుడు ఒక్కసారిగి దాడి చేస్తున్నాడు. ఈ జిల్లా, ఆ జిల్లా అని లేదు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా ఒకటే వానలు. జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడి.. వందల గ్రామాలకు కనెక్టివిటీ లేకుండా పోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. ఊళ్లకు ఊళ్లు జలదిగ్భంధంలోకి వెళ్లిపోయాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 మంది మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు. వందలాది మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర ప్రభుత్వ బృందాలు సహాయక చర్యలు ముమ్మం చేశాయి.
అటు, మహాబలేశ్వరంలో 52 ఏళ్లలో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో వర్షం పడుతోంది. నిన్న ఒక్కరోజే 48 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మహారాష్ట్రలో వర్షాలతో గోదావరి, కృష్ణకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. రాయ్‌గడ్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మహద్‌తలైలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 300 మంది చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదుగురు ప్రాణాలు కూడా కోల్పోయారు. రోడ్లు, ధ్వంసం కావడంతో కొల్హాపూర్ జిల్లాలో సుమారు 47 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ఊళ్లు జలదిగ్భంధంలో మునిగిపోయాయి. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వ సహాయం కోరింది మహారాష్ట్ర ప్రభుత్వం. బాధితుల్ని రక్షించేందుకు ఆర్మీ, నేవీ బృందాలు రంగంలోకి దిగాయి.
Western Naval Command of the Indian Navy mobilises resources to provide assistance to State and District administrations of affected areas in Maharashtra, Karnataka and Goa that are reeling under flooding of both urban and rural areas due to incessant rains. pic.twitter.com/WMNHyDfv5M
— ANI (@ANI) July 24, 2021
అటు నాందేడ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కార్లు వరదలో కొట్టుకుపోతున్నాయి. పాంచగంగలో మోకాళ్లలోతు నీళ్లలో జనం తిప్పలు పడుతున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.సతారా జిల్లాలోని నదులన్నీ అతి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలో ఉన్న హైవేలన్నీ జలదిగ్భంధంలో ఉన్నాయి. సుమారు 10 రాష్ట్ర హైవేల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముంబై నుంచి పూణే, నాసిక్, కొంకణ్, ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ నిలిచిపోయాయి.
Maharashtra: A large number of goods vehicles stranded on Kolhapur Highway, as vehicular movement halted due to floods in Kolhapur. Visuals from Peth Naka in Sangli
A truck driver says, “We’re stuck here since last night. Mobile network affected too. We can’t even get tea here.” pic.twitter.com/D7OXwXYcnt
— ANI (@ANI) July 24, 2021
వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 స్థానిక సహాయ బృందాలు, భారత నావికాదళం నుండి రెండు, కోస్ట్‌గార్డ్ నుండి రెండు, జాతీయ విపత్తు నివారణ బృందం (ఎన్‌డిఆర్‌ఎఫ్) నుండి మూడు బృందాలు నీట మునిగిన ప్రాంతాల్లో మోహరించారు. భారత నావికాదళం హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు నిర్వహిస్తోంది. ఐఎన్ఎస్ అభిమన్యు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది.
Read Also…
Adilabad : నిర్మల్‌జిల్లాలో వరద బీభత్సం, పలు గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే.. బాధితుల ఆగ్రహావేశాలు
Floods in Maharashtra & Goa | In addition to helicopters, India Air Force deploys one C-17 Globemaster & 2 C-130 Super Hercules to ferry 170 personnel & 21 tonnes of load for NDRF from Bhubaneswar to Pune, Ratnagiri & Goa in preparation for Humanitarian Assistance&Disaster Relief pic.twitter.com/TSWW58L06p
— ANI (@ANI) July 24, 2021
Read Also…