Fact Check: పట్టపగలు బ్యాంకులోకి చొరబడ్డ దొంగలు.. ప్రాణాలకు తెగించి పట్టుకున్న పోలీసులు. అసలు ట్విస్ట్ ఏంటంటే.?
Bank Robbery: బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు కొందరు దొంగలు. పట్ట పగలే బ్యాంకులోకి చొరబడ్డ దొంగలను సినీ ఫక్కీలో పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు...
Bank Robbery: బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు కొందరు దొంగలు. పట్ట పగలే బ్యాంకులోకి చొరబడ్డ దొంగలను సినీ ఫక్కీలో పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగండి.. ఆగండి.. ఏంటీ ఇదంతా నిజం అనుకుంటున్నారు.? అయితే మీరు పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇదంతా.. మాక్‌డ్రిల్‌లో భాగంగా మహారాష్ట్ర పోలీసులు చేపట్టిన ఆపరేషన్. బ్యాంకులోకి దొంగలు చొరబడితే పోలీసులు ఎలా స్పందించాలన్న దానిపై ఈ మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ షెండీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో పోలీసులు ఈ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. బ్యాంకులో చొరబడ్డ దొంగలను పట్టుకునే క్రమంలోనే పోలీసులు ఎంత చాకచక్యంతో వ్యవహరించారన్న విధానాన్ని చక్కగా చూపించారు. చేతిలో గన్నులతో హల్చల్ చేస్తున్న దోపిడి దొంగలకు పోలీసులు బుద్ధి చెప్పారన్నది చాలా సహజంగా చూపించారు.
ఈ సమయంలో బ్యాంకు ముందు జనాలు ఒక్కసారిగా గుమి గూడారు. ఒక్క క్షణం ఇదంతా నిజంగానే జరుగుతుందా.? అని అందరూ భయాందోళనకు గురయ్యారు. అయితే మాక్‌డ్రిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యాంకు రాబరీ నిజంగానే జరిగిందంటూ ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లను ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. అయితే ఇదంతా నిజమైంది కాదని, మాక్ డ్రిల్‌లో భాగంగా చేపట్టిన నటన అని పోలీసులు అధికారికంగా తెలియజేయాల్సి వచ్చింది. మరి ఈ మాక్‌డ్రిల్‌కు సంబంధించిన వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Kurnool: పత్తికొండ టమోటా మార్కెట్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి.. రైతుల కంటతడి