Raj Thackeray: మహారాష్ట్రలో కుల రాజకీయాలకు శరద్ పవార్ బాధ్యుడు.. రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు!

ఎన్సీపీ పుట్టాక కుల రాజకీయాలు పెరిగాయి. ఎన్సీపీ పుట్టిన తర్వాత ఇతర కులాలను ద్వేషించడం నేర్పించారు.

Raj Thackeray: మహారాష్ట్రలో కుల రాజకీయాలకు శరద్ పవార్ బాధ్యుడు.. రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు!
Raj Thackeray
Follow us

|

Updated on: Apr 02, 2022 | 9:44 PM

Raj Thackeray Hot Comments: రాష్ట్రంలో కుల రాజకీయాలకు శరద్ పవార్ కారణమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS) అధినేత రాజ్ థాకరే(Raj Thakre) ఆరోపించారు. శివాజీ పార్కు వద్ద జరుగుతున్న గుడిపడ్వ మేళాలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శివసేన, ఎన్సీపీపై రాజ్ థాకరే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే దిగిపోవాలని విమర్శల బాణం కూడా ఎక్కుపెట్టారు. మీరు కుల రాజకీయాలలో కూరుకుపోయి ఉంటే, మీరు ఏ హిందుత్వాన్ని మోస్తారు అని రాజ్ థాకరే ప్రశ్నించారు.

1999లో ఎన్సీపీ పుట్టాక కుల రాజకీయాలు పెరిగాయి. ఎన్సీపీ పుట్టిన తర్వాత ఇతర కులాలను ద్వేషించడం నేర్పించారు. కులం నుంచి బయటకు రాకపోతే మనం ఎప్పుడు హిందువులం కాలేమని రాజ్ థాకరే అన్నారు.

శివాజీ పార్క్‌లో జరుగుతున్న గుడిపడ్వ మేళాలో కార్యకర్తలను ఉద్దేశించి రాజ్ ఠాక్రే మరోసారి హిందుత్వ అంశాన్ని లేవనెత్తారు. మజీదులపై మోగుతున్న మైకులపై రాజ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “నేను ప్రార్థనకు వ్యతిరేకం కాదు. అయితే మసీదులకు మైకు కొమ్ములు దించాల్సిందేనని, ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం తీసుకోకపోతే మసీదుల ముందు హనుమాన్ చాలీసా స్పీకర్లను అమర్చాలి. నేను మతోన్మాదిని కాదు, నేను భక్తుడిని” అని రాజ్ ఠాక్రే మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాజ్ థాకరే తాను మతోన్మాదిని కాదని, భక్తుడని అన్నారు. నేను ఎవరి ప్రార్థనలను వ్యతిరేకించను. అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఉదయం ఐదు గంటల నుంచి ఇబ్బంది. లౌడ్ స్పీకర్ ఏ మతంలో వ్రాయబడింది? మతం ఏర్పడినప్పుడు లౌడ్ స్పీకర్ ఉందా? విదేశాల్లో చూడండి. మీకు ఎక్కడా లౌడ్ స్పీకర్ కనిపించదు. మీరు మీ ప్రభువును ప్రార్థించాలనుకుంటే, ఇంట్లో చేసుకోవాలని రాజ్ థాకరే సూచించారు.

Read Also…  Ramzan 2022: కనిపించిన నెలవెంక.. రేపటినుంచే రంజాన్ ఉపవాస దీక్షలు..