AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Babli Gates Open: బాబ్లీ గేట్లు ఎత్తివేసిన అధికారులు.. పరివాహక ప్రజలను హెచ్చరించిన అధికారులు

నిన్న జూలై ఒకటి కావడంతో బాబ్లీ గేట్లు ఎత్తి వేశారు అధికారులు. ఈ గేట్లు ఎప్పటి వరకూ ఇలాగే తెరిచి ఉంచుతారు? ఆ డీటైల్స్ ఏంటి?

Babli Gates Open: బాబ్లీ గేట్లు ఎత్తివేసిన అధికారులు.. పరివాహక ప్రజలను హెచ్చరించిన అధికారులు
Babli Project Gates
Sanjay Kasula
|

Updated on: Jul 01, 2022 | 10:43 PM

Share

మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో.. బాబ్లీకి సంబంధించిన 14 గేట్లు ఎత్తారు మహారాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు. 120 రోజులపాటు ఈ గేట్లు ఇలాగే తెరచి ఉంచుతారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అభ్యంతరంపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏటా జులై 1వ తేదీన ప్రాజెక్టు గేట్లు తెరవాలని.. అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లు ఎత్తే ఉంచాలని ఆదేశించింది. 2013 ఫిబ్రవరి 28న బాబ్లీ ప్రాజెక్టుపై తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు. ఏటా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్న మహారాష్ట్ర అధికారులు.. నిన్న జులై 1వ తేదీ కావడంతో ఈ గేట్లు ఎత్తారు.బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తాక.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు, గ్రామ పంచాయతీలకు హెచ్చరికలు చేయడంతోపాటు ప్రజలందరికీ తెలిసేలా.. సైరన్ మోగించి తెలియ చేశారు. బాబ్లీ గేట్ల ఎత్తివేతతో దాదాపు 1 టీఎంసీల నీరు దిగువ గోదావరిలోకి వస్తుందని అంచనా.

బాబ్లీ ప్రాజెక్టులో గేట్లు తెరిచే సమయానికి ఒక టీఎంసీ నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 2.7టీఎంసీలు. కాగా ప్రస్తుతం ఇన్ ఫ్లో ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు అధికారులు. మహారాష్ట్రలోని ధర్మాబాద్ దగ్గర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్ల ద్వారా గోదావరి నదిలోకి విడుదలైన నీరు 80 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణలోని ఎస్ ఆర్ ఎస్పీకి చేరుకుంటుంది.

నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని ఆయకట్టుకు సాగునీరు అందుబాటులో ఉంటుంది. గోదావరిలో వరద ప్రవాహం మొదలైనందు వల్ల జాలర్లతో పాటు రైతులు, నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

తెలంగాణ వార్తల కోసం