AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: పాక్‌ చరలో 682 మంది భారత్‌ ఖైదీలు

ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం భారత్‌తో నేడు కీలక విషయాలు పంచుకుంది. తమ దేశ జైళ్లలో దాదాపు 682 మంది భారత సంతతికి చెందిన ఖైదీలు..

Pakistan: పాక్‌ చరలో 682 మంది భారత్‌ ఖైదీలు
Pakistan
Srilakshmi C
|

Updated on: Jul 01, 2022 | 9:49 PM

Share

682 Indian prisoners in Pak jails: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం భారత్‌తో నేడు కీలక విషయాలు పంచుకుంది. తమ దేశ జైళ్లలో దాదాపు 682 మంది భారత సంతతికి చెందిన ఖైదీలు ఉన్నట్లు శుక్రవారం (జులై 1) పాకిస్థాన్‌ తెల్పింది. వీరిలో 49 మంది పౌరులు, 633 మంది మత్స్యకారులు పాక్‌ కస్టడీలో ఖైదీలుగా ఉన్నట్లు వెల్లడించింది. అదేవిధంగా భారత్‌ జైళ్లలో 461 మంది పాకిస్తానీ ఖైదీలు ఉన్నట్లు పాకిస్థాన్‌తో పంచుకుంది. వీరిలో 45 పాక్‌ పౌరులు, 116 మంది మత్స్యకారులని భారత్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెల్పింది. కాన్సులర్ యాక్సెస్‌పై 2008 ఒప్పందంలోని నిబంధనల ప్రకారం ఏడాదికి రెండు సార్లు అంటే.. జనవరి 1, జూలై 1 తేదీల్లో ఖైదీల వివరాలను ఇరు దేశాలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది

పాక్‌లో జైలు శిక్ష పూర్తి చేసుకున్న 536 మంది భారతీయ మత్స్యకారులు, 3 పౌరులను విడుదల చేసి స్వదేశానికి పంపించాలని, పాకిస్తాన్ చెరలో ఖైదీలుగా ఉన్న 105 మంది మత్స్యకారులు, 20 మంది పౌరులకు తక్షణమే కాన్సులర్ యాక్సెస్ అందించాలని పాకిస్తాన్‌ను కోరింది. ఆయా ఖైదీల జాతీయత ధృవీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తామని, అన్ని విషయాలకు భారత్‌ కట్టుబడి ఉందని, అదేవిధంగా పాక్‌ ఖైదీల జాతీయత నిర్ధారణను అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్‌ను కోరింది.