సొంత పార్టీపైనే శల్య వ్యాఖ్యలు.. నిరుపమ్ మాటలపై మండిపడ్డ రాహుల్

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌.. కనీసం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనైనా గట్టి పోటీ ఇద్దామనుకున్న ఆశలు అడియాశలైనట్లు కన్పిస్తోంది. సొంత పార్టీ నేతలే.. పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటూ వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర కాంగ్రెస్‌లో గందరగోళాన్ని సృష్టించాయి. పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పార్టీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. ముంబైలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను చిత్తుచిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. అతి […]

సొంత పార్టీపైనే శల్య వ్యాఖ్యలు.. నిరుపమ్ మాటలపై మండిపడ్డ రాహుల్
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 6:13 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌.. కనీసం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లోనైనా గట్టి పోటీ ఇద్దామనుకున్న ఆశలు అడియాశలైనట్లు కన్పిస్తోంది. సొంత పార్టీ నేతలే.. పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటూ వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర కాంగ్రెస్‌లో గందరగోళాన్ని సృష్టించాయి. పార్టీ సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ పార్టీ అధిష్టానం తీరుపై మండిపడ్డారు. ముంబైలో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను చిత్తుచిత్తుగా ఓడిపోతుందంటూ వ్యాఖ్యలు చేశారు. అతి కష్టం మీద మూడు, నాలుగు స్థానాలను గెలుపొందే అవకాశం ఉందంటూ జోస్యం చెప్పారు. తాను సూచించిన అభ్యర్థులను కాకుండా వేరే వారిని కేటాయించడంతో ఈ పరిస్థితి నెలకొందని నిరుపమ్ తెలిపారు. అంతేకాదు ఎన్నికల ప్రచారానికి రానంటూ కాంగ్రస్ అధిష్టానానికి తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు మొదలైంది. నిరుపమ్ ఎన్నికల వరకు కాంగ్రెస్‌లో ఉంటారా.. లేక పార్టీ ఏమైనా మారతారా అన్ని సందేహం వ్యక్తమవుతోంది. పదిహేనేళ్ల క్రితం శివసేనను వీడి కాంగ్రెస్‌లో చేరారు నిరుపమ్. కాగా, ఈ నెల అక్టోబర్ 21న రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. 24న కౌంటింగ్‌ జరుగనుంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ-శివసేన ఇప్పటికే దూకుడు పెంచగా.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత గొడవలు ఎటు దారి తీస్తాయో అర్థ కాని పరిస్థితి నెలకొంది.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు