AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధానితో సుదీర్ఘ భేటీ.. జగన్ ఆహ్వానంపై మోదీ ఏమన్నారంటే..?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీని కలిసిన జగన్.. సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చలు జరిపారు.  ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధాన మంత్రికి వివరించి.. రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని అభ్యర్థించారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం. ఈ నెల 15నుంచి శ్రీకారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య […]

ప్రధానితో సుదీర్ఘ భేటీ.. జగన్ ఆహ్వానంపై మోదీ ఏమన్నారంటే..?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 05, 2019 | 7:57 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శనివారం సాయంత్రం సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4:30 గంటలకు మోదీని కలిసిన జగన్.. సుమారు గంటన్నర పాటు ఆయనతో చర్చలు జరిపారు.  ఏపీకి సంబంధించిన పలు అంశాలను ప్రధాన మంత్రికి వివరించి.. రాష్ట్రాన్ని కేంద్రమే ఆదుకోవాలని అభ్యర్థించారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించినట్లు సమాచారం.

ఈ నెల 15నుంచి శ్రీకారం రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దానికి మోదీ సానుకూలంగా స్పందించారని సమాచారం.  వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. అదే విధంగా పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం జగన్‌ వివరించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏపీకి సంబంధించిన సమస్యలు, కేంద్రంతో ముడిపడి ఉన్న అంశాలను ప్రధానితో భేటీలో సీఎం చర్చించినట్లు సమాచారం.

తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు సంయుక్తంగా ప్రణాళికలు రచిస్తున్న కృష్ణా- గోదావరి జలాల అనుసంధానం కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిధులపై కూడా వీరు చర్చించారు. కాగా రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని భావించిన ముఖ్యమంత్రి జగన్.. ఆయనను సగౌరవంగా ఆహ్వానం అందించారని, దానికి మోదీ సానుకూలంగా స్పందించారని ఏపీ సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు