AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పనిమనిషి కోసం.. రోడ్డెక్కిన యువ జంట.. ఎందుకో తెలుసా..?

పక్కనవారు చనిపోతున్న పట్టించుకోకుండా వెళిపోయే రోజులివి. ఇలాంటి రోజుల్లో కూడా మంచివారు ఉన్నారు అంటే అందుకు ఈ దంపతులే ఉదాహరణ. తమ ఇంటి పనిమనిషికి బాగోలేదని.. స్వయంగా వారే టిఫెన్ అమ్మి ఆమెకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ముంబైకి చెందిన అశ్వినీ, ఆమె భర్త ఎంబిఏ చదివారు. ఇద్దరు ప్రవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వాళ్ల ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్త ఆనారోగ్యానికి గురయ్యాడు. అతడు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అది తెలుసుకున్న […]

పనిమనిషి కోసం.. రోడ్డెక్కిన యువ జంట.. ఎందుకో తెలుసా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 05, 2019 | 5:13 PM

Share

పక్కనవారు చనిపోతున్న పట్టించుకోకుండా వెళిపోయే రోజులివి. ఇలాంటి రోజుల్లో కూడా మంచివారు ఉన్నారు అంటే అందుకు ఈ దంపతులే ఉదాహరణ. తమ ఇంటి పనిమనిషికి బాగోలేదని.. స్వయంగా వారే టిఫెన్ అమ్మి ఆమెకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ముంబైకి చెందిన అశ్వినీ, ఆమె భర్త ఎంబిఏ చదివారు. ఇద్దరు ప్రవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వాళ్ల ఇంట్లో పనిచేసే పనిమనిషి భర్త ఆనారోగ్యానికి గురయ్యాడు. అతడు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అది తెలుసుకున్న అశ్వినీ దంపతులు.. పనిమనిషికి ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో ఆమెతో టిఫిన్ సెంటర్ పెట్టించారు. ఆమె చేసిన వంటను వీరే స్వయంగా అమ్మి పెడుతున్నారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఉదయం 4 గంటల నుంచి 9 గంటల వరకు టిఫెన్లు అమ్మి.. తరువాత వారి ఉద్యోగాలకు వెళిపోతున్నారు. వీరు చేస్తున్న సేవను గుర్తించి భాటియా అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ముంబైలో ఓ సారి రైల్వే స్టేషన్ పక్కన భాటియా టిఫెన్ చేయడానికి వెళ్లాడు. వాళ్లను చూసి ఉండలేక.. చూడటానికి ధనవంతుల్లా కనిపిస్తున్నారు. ఈ టిఫిన్ సెంటర్ మీదేనా..? అని అడిగారు. అప్పుడు వారు చెప్పిన సమాధానం విని అతడు ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటూ.. వారి గురించి అందరికి తెలియాలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Follow Us
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. వారందరికి ఫ్రీగా ల్యాప్‌టాప్స్
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
సవాళ్లు-ప్రతిసవాళ్లు.. తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్..
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
కడుపులో వేడి వల్ల నోటి పూత వేధిస్తోందా? తేనె, మజ్జిగ, పసుపుతో ఇలా
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
ఐసీసీ చైర్మన్ జై షాకు ధన్యవాదాలు తెలిపిన షారుఖ్
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
దమ్ముంటే టచ్‌ చేయ్‌రా.. చిరుతకు చింటూ బ్రో సవాల్..
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు కార్మికులు మృతి!
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
అతిధులకు వానాకాలంలో జొన్న పిండితో చేసి పెడితే ఇమ్యూనిటీ డబుల్
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన 20 మంది మహిళలు.. ఆ అనుమానంతో ఆరా తీస్తే
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!
ముంబైలో ఫ్లాప్.. చెన్నైలో సూపర్ హిట్.. రాత మారిన ప్లేయర్లు..!