Dairy Farmer Buy A Helicopter : పాల వ్యాపారం కోసం ఏకంగా హెలికాఫ్టర్ ను కొన్న ఓ బడా రైతు..
సాధారణంగా రైతులు ట్రాక్టార్, జెబిసి వంటివి కొనుగోలు చేస్తుంటారు.. అయితే తాను అందరికంటే భిన్నం అంటూ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఏకంగా...
Dairy Farmer Buy A Helicopter: వ్యవసాయం, పాలవ్యారం దళారుల చేతుల్లో పెట్టకుండా సొంత తెలివి తేటలతో చేస్తే దండగ కాదు పండగే అంటున్నారు ఈ బడా రైతు. సాధారణంగా రైతులు ట్రాక్టార్, జెబిసి వంటివి కొనుగోలు చేస్తుంటారు.. అయితే తాను అందరికంటే భిన్నం అంటూ మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఏకంగా విమానాన్ని కొనేసాడు. మరి పాల వ్యాపారానికి.. హెలికాఫ్టర్ కొనుగోలుకు లింక్ ఏమిటంటే..
మహారాష్ట్రలోని భివాండికి చెందిన జనార్థన్ బోయిర్ బడా రైతు..ఇతను రైతే కాదు.. అనేక వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. అయితే ఇటీవలే కొత్తగా పాల వ్యాపారంలోకి ప్రవేశించాడు. దీంతో వ్యాపారాభివృద్ధి కోసం పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ వంటి అనేక ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ప్రాంతాల్లో ఎయిర్ పోర్ట్ లేకపోవడంతో.. రైల్లోనో.. బస్సులోనో ప్రయాణించే వాడు జనార్థన్ బోయిర్. దీంతో సమయం వెస్ట్ అయ్యేది.. ఓ స్నేహితుడు హెలికాఫ్టర్ కొనమని సలహా ఇచ్చాడు.. వెంటనే స్నేహితుడి సలహాను పాటిస్తూ.. ఏకంగా రూ. 30 కోట్లు పెట్టి ఓ హెలికాఫ్టర్ కొనుగోలు చేశాడు.
వెంటనే హెలీకాప్టర్ ను గ్రామానికి తీసుకొచ్చి ట్రయల్ కూడా వేశారు. 2.5 ఎకరాల స్థలంలో హెలీకాప్టర్ కోసం ప్రొటెక్షివ్ వాల్‌ను కూడా నిర్మించుకున్నాడు. మార్చ్ 15న కొత్త హెలీకాప్టర్ డెలివరీ కానుంది. 30 కోట్లు ఖర్చుపెట్టి హెలికాఫ్టర్ కొన్న జనార్దన్ ఈ 30 కోట్లు ఒక ఏడాదిలోపే సంపాదిస్తానని గట్టిగా చెబుతున్నాడు పొలానికి వెళ్లేందుకు హెలీకాప్టర్ కొనుగోలు చేసుకుంటాను, లోన్ ఇప్పించమని రాష్ట్రపతికి ఓ మహిళ లేఖ రాసిన ఘటన మర్చిపోకముందే..ఏకంగా పాలమ్ముకోడానికి హెలికాప్టర్ కొనుగోలు చేసి సంచలనం రేపాడితడు.
Also Read: