మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Maharashtra Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే..

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Apr 29, 2021 | 10:04 PM

Maharashtra Covid-19 Updates: దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. అయితే మహారాష్ట్రలో అయితే తీవ్ర స్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇక దేశంలోనే కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో 66,159 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 771 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,39,553 ఉండగా, మొత్తం మరణాలు 67,985కు చేరుకున్నాయి. ఇక తాజాగా కరోనా నుంచి 68,537 మంది కోలుకొని డిశ్చా్ర్జ్‌ కాగా, ఇప్పటి వరకు 37,99,266 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 6,70,301 యాక్టివ్ క‌రోనా కేసులు ఉన్నట్లు తెలిపింది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాల్లో మ‌హారాష్ట్ర తొలి స్థానంలో ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే కరోనా కట్టడికి మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. నౌట్‌ కర్ఫ్యూ అమలు అవుతోంది. రాష్ట్రంలో మాస్కులు లేకుండా బయట తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు.

ఇవీ చదవండి

Corona Pandemic: కోవిడ్ వార్డులో వైద్య సిబ్బంది భాంగ్రా డ్యాన్స్..కరోనా పేషెంట్ల ఉత్సాహం..ఇంటర్నెట్ లో చూసిన వారికి ఉల్లాసం!

Jagan on Vaccination: వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌పై కీలక వ్యాఖ్యలు.. ఫిబ్రవరి దాకా సాధ్యం కాదని వ్యాఖ్య