AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh 2025: ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్రంగా భారత్.. ప్రపంచ నలుమూలల నుంచి పోటెత్తుతున్న విదేశీ పర్యాటకులు!

144 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాకు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. దీంతో విదేశీ టూరిజంలో గణనీయమైన పెరుగుతున్న కనిపించింది. ముఖ్యంగా బారత్ లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అమెరికా, యూకే వంటి దేశాల నుంచి పర్యాటకులు పోటెత్తుతున్నారు. దీంతో భారత్ ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్రంగా మారుతుందన్న సూచనలు కనిపిస్తున్నాయి..

Maha Kumbh 2025: ఆధ్యాత్మిక పర్యాటకానికి కేంద్రంగా భారత్.. ప్రపంచ నలుమూలల నుంచి పోటెత్తుతున్న విదేశీ పర్యాటకులు!
Spiritual Tourism In India
Srilakshmi C
|

Updated on: Jan 24, 2025 | 1:32 PM

Share

ప్రయాగ్‌రాజ్‌, జనవరి 24: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహ కుంభమేళకు దేశంలోనే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దేశంలోని మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు యేటా మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల నుంచి దేశంలోని ఆధ్యాత్మిక కార్యక్రమాకు తరలి వస్తున్న పర్యాటకుల్లో 21.4 శాతం పెరుగుదల కనిపిస్తుంది. ప్రముఖ వీసా ప్రాసెసింగ్‌ ప్లాట్‌ఫాం అట్లీస్‌ నివేదికల ప్రకారం.. దాదాపు 48 శాతం ఆధ్యాత్మిక ప్రయాణ వీసా అప్లికేషన్లు మహా కుంభ్ వంటి పెద్ద ఈవెంట్‌లు, తీర్థయాత్రలకు లింక్ చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న మహా కుంభమేళా.. ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటి. 42 మిలియన్ల మంది యాత్రికులు కుంభ్‌ మేళాకు వస్తారని అంచనా. 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం దేశీయ, అంతర్జాతీయ సందర్శకులకు, భక్తులకు బాగా కనెక్ట్‌ అయ్యింది.

దీంతో US, UK వంటి దేశాల నుంచి కూడా ఆధ్యాత్మిక పర్యాటకుల సంఖ్య కూడా ఎన్నో రెట్లు పెరిగింది. వీరిలో మంది ప్రామాణికమైన, జీవితాన్ని మార్చే అనుభవాల కోసం అన్వేషిస్తున్నారు. సహస్రాబ్ది ఆధ్యాత్మిక యాత్రికులలో 66% మంది మహిళలు ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నారు. సాంప్రదాయ పర్యాటక కార్యకలాపాల కంటే ఆధ్యాత్మిక, అర్ధవంతమైన ఈవెంట్ల కోసం ఎక్కువ మంది యువత సెలవులను కేటాయిస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకంలో కనిపించిన ఈ కొత్త ట్రెండ్.. గ్రూప్ ట్రావెల్ పట్ల ఆసక్తిని పెంచుతోంది. సమూహ ఆధ్యాత్మిక అనుభవాల కోసం ఇన్‌బౌండ్ ప్రయాణం కోసం ఏకంగా అప్లికేషన్లు 35 శాతం పెరిగాయట. గ్రూప్‌ టూరిజంలో భాగంగా పర్యాటకులు పవిత్ర ప్రదేశాలను సందర్శించినప్పుడు.. అక్కడి ఆచారాలలో పాల్గొనేందుకు అసక్తి చూసుతున్నారు.

ముఖ్యంగా భారత్ ఆధ్యాత్మిక పర్యాటకం గత కొన్నేళ్లుగా బాగా పుంజుకుంది. వారణాసి, రిషికేశ్ వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఈ జాబితాలో ముందున్నాయి. ఇక్కడకు ప్రతి యేట మిలియన్ల మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు. గంగానది పక్కన ధ్యానం చేయడానికి, సాయంత్రం హారతి చూడటానికి అమితాసక్తి కనబరుస్తున్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్ధికి అధికారులు కూడా తీర్థయాత్రల చుట్టూ ఉన్న మౌలిక సదుపాయాలు, వసతిని అప్‌గ్రేడ్ చేశారు. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి ఆధ్యాత్మిక అన్వేషకులను స్వాగతించడానికి, మరిన్ని అనుభూతులను అందించడానికి భారత ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. మహా కుంభ్ వంటి అరుదైన కార్యక్రమాలకు రికార్డు స్థాయిలో పర్యాటకులను ఆకర్షించడం, దాని ఆధ్యాత్మిక వారసత్వంపై పెరుగుతున్న ప్రపంచ ఆసక్తి వల్ల.. భారత్ ఆధ్యాత్మిక పర్యాటక డిస్టనేషన్‌గా మారనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.