AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajahmundry Road Accident: తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం.. రాజమండ్రిలో ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు బోల్తా! మహిళ మృతి

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గామన్‌ వంతెనపై బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన వేమూరి కావేరి ట్రావెల్‌ బస్సు ప్రమాదానికి గురైంది. మద్యం మత్తులో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా బస్సు నడపడంతో రోడ్డుపై పల్టీలు కొడుతూ అల్లంత దూరాన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందింది..

Rajahmundry Road Accident: తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం.. రాజమండ్రిలో ప్రైవేట్‌ ట్రావెల్ బస్సు బోల్తా! మహిళ మృతి
Rajahmundry Road Accident
Srilakshmi C
|

Updated on: Jan 24, 2025 | 2:03 PM

Share

రాజమండ్రి, జనవరి 23: ప్రయాణికులతో నిండుగా ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపై సాఫీగా వెళ్తుంది. బస్సులోని వారంతా నిశ్చింతగా గాఢనిద్రలో ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా భారీ కుదుపు. ఏం జరిగిందో తెలుసుకునేలోపు బస్సు రోడ్డుపై పల్టీలు కొడుతూ అల్లంత దూరంలో బోల్తా పడింది. బస్సులోని ప్రయాణికులంతా చింతవందరగా పడిపోయారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం తెల్లవారు జామున ఆ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమండ్రి దివాన్ చెరువు హైవేపై ప్రయాణికులతో వెళ్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో కోమలి 21 సంవత్సరాలు మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. దాదాపు బస్సులోని ప్రయాణికులంతా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 28 మంది ప్రయాణికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న రాజానగరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దివాన్ చెరువు గామాన్ బ్రిడ్జ్ హైవేపై వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడి.. రోడ్డుపై ఫిల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడకక్కడే మహిళ మృతి చెందగా.. మరో మహిళకు కాలు తెగిపోయింది. క్షతగాత్రులందరినీ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంత ప్రమాదం జరిగినా 50 మందికి పైగా ప్రయాణికులు, చిన్నారులు ప్రాణాలతో బయటపడటం విశేషం. రోడ్డుపై బస్సు అడ్డదిడ్డంగా పడిపోవడంతో.. ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిలో 26 మందిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా ఇందులో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యం, మద్యం మత్తులో ఉన్న కారణంగా అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. పైగా బస్సు బోల్తాపడిన విషయం పోలీసులకు ఆలస్యం తెలియడంతో పోలీసులు, ఇతర సహాయక సిబ్బంది అక్కడికి చేరుకునేలోపు క్షతగాత్రులు దాదాపు గంటపాటు రోడ్డుపై విలవిల్లాడి పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
ఆమె అపస్మారక స్థితిలో ఉంటే ఆస్పత్రిలో కూడా చేర్చుకోనన్నారు..
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
అప్పుడే ఓటీటీలోకి ఉపేంద్ర, శివన్నల బ్లాక్ బస్టర్ మూవీ
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. బ్యాంకులకు కీలక ఆదేశాలు..
మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. బ్యాంకులకు కీలక ఆదేశాలు..