Delhi Liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవకు బెయిల్.. అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా..
రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు రాఘవ. బెయిల్ పిటిషన్‌ను అంగీకరించింది న్యాయస్థానం. మాగుంట రాఘవకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డికి కూడా ఇప్పటికే కోర్టు..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు . రెండు వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అమ్మమ్మకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు రాఘవ. బెయిల్ పిటిషన్‌ను అంగీకరించింది న్యాయస్థానం. మాగుంట రాఘవకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో శరత్‌చంద్రారెడ్డికి కూడా ఇప్పటికే కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఆయన అప్రూవర్‌గా మారడంతో రాఘవకు ఊరట దక్కింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కాం.. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. వరుసగా సోదాలు, విచారణలు, అరెస్ట్‌లతో.. కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పుడు ఈ కుంభకోణంలో నిందితుడు, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి ఆప్రూవర్‌గా మారారు. అటు.. వరుసగా అరెస్టులు చేస్తూ.. సీబీఐ దూకుడు పెంచుతుండటంతో.. లిస్ట్‌లో ఉన్నవారి గుండెల్లో గుబులు రేగుతోంది.
ఇదిలా ఉంటే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారడంపై స్పెషల్ కోర్టులో సవాల్ చేయాలని ఆప్ నేతలు భావిస్తున్నారన్న చర్చ మొదలైంది. మాగుంట రాఘవరెడ్డిని సౌత్ గ్రూప్‌లో కీలక పాత్రధారిగా మాగుంట రాఘవను ఈడీ పేర్కొంది. ఢిల్లీలో పలు జోన్లకు మాగుంట రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. స్పెషల్ కోర్టు బెయిల్ మంజూర్ చేయడంతో మాగుంట రాఘవ విడుదలకానున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం