Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ఓ భర్త కిరాతకం.. టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యను చంపేశాడు.. ఎక్కడ జరిగిందంటే..

Madhyapradesh Crime News: ఆడవారిపై మగాళ్ల అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది.

Crime News: ఓ భర్త కిరాతకం.. టవల్ ఆలస్యంగా ఇచ్చిందని భార్యను చంపేశాడు.. ఎక్కడ జరిగిందంటే..
Crime News
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 09, 2021 | 10:53 AM

Madhyapradesh Crime News: ఆడవారిపై మగాళ్ల అరాచకం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. స్నానం చేసిన తరువాత టవల్ అడిగితే ఆలస్యంగా ఇచ్చిందని భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. బాలాఘాట్ జిల్లా కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హీరాపూర్ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడుు అటవీశాఖలో రోజూవారీ కూలీ అయిన రాజ్ కుమార్ బహే(50) స్నానం చేసిన తరువాత టవల్ ఇవ్వాలని భార్య పుష్పా బాయి(45)ని కోరాడు. అయితే, పుష్పా బాయి ఆ సమయంలో ఇంట్లో గిన్నెలు కడుగుతోంది. దాంతో కొంచె ఆగాలని కోరింది.

భార్య అలా చెప్పడంతో కోపోద్రిక్తుడైన రాజ్ కుమార్.. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి భార్యపై దాడి చేశాడు. ఆమె తలపై పార తీసుకుని పలుమార్లు కొట్టాడు. దాంతో తీవ్రంగా గాయపడిన పుష్పా బాయి.. రక్తపు మడుగు కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది. కాగా, పుష్పా బాయిపై దాడి చేస్తుండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన 23 ఏళ్ల కుమార్తెను బెదిరించాడు. ఈ దాడిలో పుష్పాబాయి ప్రాణాలు కోల్పోవడంతో.. కుటుంబ సభ్యలు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. పుష్పా బాయి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితుడు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై కేసు నమోదు రిమాండ్‌కు తరలించారు.

Also read:

Fake currency: భాగ్యనగరంలో నకిలీ నోట్ల కలకలం.. రూ.2 కోట్ల ఫేక్ కరెన్సీ స్వాధీనం..

Special Trains: రైల్వే ప్రయాణీలకు అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రత్యేక ప్యాసింజర్ రైళ్లు

Samantha: అరుదైన గౌరవం అందుకున్న సమంత.. సౌత్ ఇండియా సినీపరిశ్రమలోనే తొలి మహిళగా..