Madhyapradesh Accident: ఘోర బస్సు ప్రమాదం..పెరుగుతున్న మృతుల సంఖ్య.. ఇప్పటి వరకు 30కిపైగా మృదేహాల వెలికి తీత
Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 60 మంది వరకు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ....
Madhyapradesh Accident: మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 60 మంది వరకు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి సిధి జిల్లా పట్నా సమీపంలో ఉన్న బ్రిడ్జి నుంచి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముందుగా 28 మంది మృతి చెందినట్లు గుర్తించగా, ప్రస్తుతం మృతుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 38 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఘటన స్థలంలో పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కొందరిని ప్రాణాలతో రక్షించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు సమచారం. నదిలో బోల్తా పడ్డ బస్సు పూర్తిగా మునిగిపోవడంతో సహాయక ముమ్మరం చేశామని ఐజీ ఉమోష్ జోగ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సు ఫోర్సుతో పాటు గజ ఈతగాళ్లు, క్లేన్లను రంగంలోకి దింపారు. బస్సును క్రేన్లతో వెలికితీసే చర్యలు చేపట్టారు.
చాలా దురదృష్టకర ఘటన: సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 30కిపైగా మృతదేహాలను వెలికితీసినట్లు మధ్యప్రదేశ్ మంత్రి తులసి సిలావత్ తెలిపారు.
Also Read: Madhyapradesh Accident: మధ్యప్రదేశ్ ఘోర బస్సు ప్రమాదంపై స్పందించిన అమిత్ షా.. కార్యక్రమం రద్దు