Uttarakhand Flood Disaster: ‘ఏడీ నా యజమాని ‘ ? ఉత్తరాఖండ్ లో తపోవన్ సొరంగ మార్గం వద్ద ‘బ్లాకీ’ ఎదురుచూపులు
ఉత్తరాఖండ్ లో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది జాడ ఇంకా తెలియడంలేదు. తపోవన్ టనెల్ లో

ఉత్తరాఖండ్ లో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది జాడ ఇంకా తెలియడంలేదు. తపోవన్ టనెల్ లో ఇప్పటికీ చిక్కుబడిపోయినవారిని రక్షించేందుకు సహాయకబృందాలు నేటికీ శ్రమిస్తున్నాయి. అయితే ఇక్కడే-ఈ ప్రాంతం వద్దే పుట్టి, పెరిగి స్థానికుల అభిమానాన్ని, ప్రేమను సంపాదించుకున్న ‘బ్లాకీ’ అనే నల్ల శునకం మాత్రం రోజుల తరబడి ఇక్కడ తచ్చాడుతోంది. తనకు బిస్కట్లు, ఇతర ఆహారాన్ని పెడుతూ తన బాగోగులు చూసుకున్న తన యజమాని ఏమయ్యాడో తెలియక ఈ మూగజీవి అల్లాడుతోంది. ప్రతి రోజు ఉదయమే ఇక్కడికి వచ్చి…సాయంత్రం వరకు తిరుగాడి ఇది వెళ్ళిపోతోందని రాజేందర్ కుమార్ అనే వర్కర్ తెలిపాడు. ఈ నెల 7 న వరదలు సంభవించినప్పుడు బ్లాకీ ఇక్కడ లేదని, అయితే ఈ మధ్యే తిరిగి వఛ్చి తన యజమాని రాక కోసం ఎదురుచూపులు చూస్తోందని ఆయన చెప్పాడు. ఈ సొరంగ మార్గంలో ఈ శునక యజమానితో సహా పలువురు చిక్కుకుపోయి ఉన్నారో లేక ప్రాణాలు కోల్పోయారో తెలియడంలేదని రాజేందర్ కుమార్ అంటున్నాడు.
కాగా పలువురు జంతు ప్రేమికులు ఈ బ్లాకీ దీనావస్థను వీడియోగా చూపి ఈ మూగజీవి పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
This will melt your heart. He is blackie & he is most probably waiting for his owner to be rescued from the tapovan tunnel. What a heartwarming story. Via @AFP pic.twitter.com/yVG6A58DTW
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) February 12, 2021
Also Read:
ISRO-Bhagavad Gita: అంతరిక్షంలోకి భగవద్గీత.. భారత జాతి గొప్పతనానికి ఇది మచ్చుతునక.. జయహో ఇండియా
Godhra Train Coach Burning Case: గోద్రా రైలు దహనం కేసు… 19 ఏళ్లకు పట్టుబడిన ప్రధాన నిందితుడు