Uttarakhand Flood: ఉత్తరాఖండ్ జలప్రళయం ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం.. బొమ్మలకు అంత్యక్రియలు
Uttarakhand Flood: ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న జలప్రళయం ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. ..
Uttarakhand Flood: ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న జలప్రళయం ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం మరో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 58కి చేరింది. వీరిలో 29 మందిని గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ బధౌరియా వివరించారు. కాగా, మరో 146 మంది ఆచూకీ లభించాల్సి ఉందని తెలిపారు. తపోవన్ ప్రాంతంలోని 1.7 కిలోమీటర్ల పొడవు ఉన్న ఎన్టీపీసీ హైడ్రోపవర్ ప్రాజెక్టు ప్రాజెక్టు సొరంగంలో ఇప్పటి వరకూ 11 మంది మృతదేహాలను వెలికి తీశారు. సొరంగంలో భారీగా పేరుకుపోయిన బుదర వల్ల గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఇప్పటి వరకు 146 మీటర్ల వమేర బురదను తొలగించామని కలెక్టర్ తెలిపారు.
బొమ్మలకు అంత్యక్రియలు ఇదిలా ఉండగా, ఈ ఘటన జరిగి పది రో జులవుతున్నా.. గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో వారు తిరిగి వస్తారనే ఆశలు కూడా వదులుకున్నారు కుటుంబ సభ్యులు. ఇక వారి మృతదేహాలు లభించే అవకాశం కూడా లేకపోవడంతో మృతుల బొమ్మలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి జౌన్సారి తెగల సంప్రదాయం ప్రకారం మృతి చెందిన వారికి 14 రోజుల్లోగా అంత్యక్రియలు నిర్వహించాలని చెబుతున్నారు. అందుకే మృతదేహాలు లభించకపోవడంతో వారి ఆకృతితో ఉన్న బొమ్మలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు.
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 28 మంది దుర్మరణం