Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 28 మంది దుర్మరణం
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో 28 మంది మృతి చెందారు. సిధి జిల్లాలో పట్నా దగ్గర బ్రిడ్జి పై నుంచి ఈ బస్సు పడిపోయింది.
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లడంతో 28 మంది మృతి చెందారు. సిధి జిల్లాలో పట్నా దగ్గర బ్రిడ్జి పై నుంచి ఈ బస్సు పడిపోయింది. అయితే ప్రమాదం జరిగిన బస్సులో 60 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మ రం చేశారు. ఏడుగురిని బస్సులోంచి సురక్షితంగా కాపాడారు. అయితే ప్రమాదంలో మృతి చెందిన 28 మంది మృతదేహాలను వెలికి తీశారు పోలీసులు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. వెలికి తీసిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో విషాదం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: పశ్చిమ గోదావరి జిల్లాలో కిడ్నాపైన రొయ్యల వ్యాపారి.. ఖమ్మం జిల్లాలో శమమై తేలాడు.. అసలు ఏమైందంటే..?