New CrPC, IPC:బ్రిటిష్ కాలం నాటి IPC, CRPCలకు త్వరలో చెక్.. చట్టాల్లో కీలక సంస్కరణలు తీసుకురానున్న కేంద్రం

మారుతున్న కాలంతో పాటు చట్టాలు కూడా మారాల్సిన అవసరం ఉందని.. ఆధునిక అవసరాలకు అనుగుణంగా చట్టాలను బలోపేతం చేయడానికి కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తోపాటు కొత్త ఇండియన్ పీనల్ కోడ్ ను...

New CrPC, IPC:బ్రిటిష్ కాలం నాటి IPC, CRPCలకు త్వరలో చెక్.. చట్టాల్లో కీలక సంస్కరణలు తీసుకురానున్న కేంద్రం
Follow us
Surya Kala

|

Updated on: Feb 16, 2021 | 12:32 PM

Centre Working on New CrPC, IPC: మారుతున్న కాలంతో పాటు చట్టాలు కూడా మారాల్సిన అవసరం ఉందని.. ఆధునిక అవసరాలకు అనుగుణంగా చట్టాలను బలోపేతం చేయడానికి కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తోపాటు కొత్త ఇండియన్ పీనల్ కోడ్ ను తీసుకురావడానికి కేంద్రం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. దీంతో కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో కీలక సంస్కరణలు తీసుకుని రాబోతుందని తెలుస్తోంది. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాలకు స్వస్తి పలికి వాటి స్థానంలో సరికొత్తవాటిని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు ప్రారంభించామని కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా భారత్‌లో బ్రిటీష్ కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి.ఈ నేపథ్యంలో చట్టాల్లో మార్పు తెచ్చే దిశగా మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా IPC, CRPC చట్టాల్లో మార్పు తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సమాజంలోని కీలకమైన వ్యక్తులు, మేధావుల నుండి సలహాలు తీసుకోనుంది. కోడ్లలో అవసరమైన మార్పులను సూచించాలని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే న్యాయవాదులు, విద్యావేత్తలు, నిపుణులు, చట్ట అమలు విభాగాలలో పనిచేస్తున్న మరియు పదవీ విరమణ చేసిన వారితో సహా సీనియర్ అధికారులకు లేఖ రాశారని కిషన్ రెడ్డి తెలిపారు.

ముఖ్యంగా అత్యాచారం కేసుల్లో ప్రస్తుత చట్టాల్లో ఎన్నో లొసుగులున్నాయి. దీంతో ఐపీసీ చట్టంలో మార్పు తేవాలని కేంద్రం యోచిస్తోంది. నిర్భయ ఘటనలో శిక్ష అమలులో జాప్యం, దిశ ఎన్‌కౌంటర్‌ వంటి కేసులు చర్చకు దారి తీసాయి. ఈ నేపథ్యంలోనే IPC, CRPC చట్టాల్లో మార్పు తేవాలని చూస్తోంది. వీటితో పాటి మిగిలిన కాలం చెల్లిన చట్లాలను కూడా సమూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.దేశంలో మహిళల రక్షణ కోసం.. తాము ముసాయిదాను బహిరంగంగా ఉంచబోతున్నామని చెప్పారు.

Also Read:

బాసర సరస్వతి అమ్మవారికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ.. చిన్నారులకు అక్షరాభ్యాసం కోసం పోటెత్తిన భక్తులు

ఇక పేద దేశాలకు కూడా సీరం కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్రీన్ సిగ్నల్.