పశ్చిమ గోదావరి జిల్లాలో కిడ్నాపైన రొయ్యల వ్యాపారి.. ఖమ్మం జిల్లాలో శమమై తేలాడు.. అసలు ఏమైందంటే..?
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బలుసుమూడికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 11న తన ఇంటి సమీపంలోనే కిడ్నాప్ కు గురైన కోదండ రామారావు..
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బలుసుమూడికి చెందిన రొయ్యల వ్యాపారి రెడ్డి కోదండ రామారావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 11న తన ఇంటి సమీపంలోనే కిడ్నాప్ కు గురైన కోదండ రామారావు మృతదేహాన్ని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం దమ్మపేట ప్రాంతంలోని తోటలో పోలీసులు గుర్తించారు. కోదండ రామారావు రొయ్యల వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి రొయ్యలను కాళ్ల మండలం దోద్దనపూడికి చెందినా బోడా వీరస్వామి సరఫరా చేస్తుంటారు. అయితే వీరాస్వామి, కోదండరమారావుల మధ్య గత కొంతకాలంగా ఆర్ధికపరమైన లావాదేవిల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. పలుసార్లు పెద్దల దగ్గర సెటిల్ మెంట్స్ కు సైతం కూర్చున్నారు. కేసులు పెట్టుకుని కోర్టులకు సైతం వెళ్లారు.
ఈక్రమంలో ఈ నెల 11న ఇంటికి వస్తున్న కోదండ రామారావును రౌడీ షీటర్ ఆవుల కొండతో కిడ్నాప్ చేయించి హత్య చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. కోదండ రామారావు వద్ద తమిళనాడుకు చెందిన మోహన్ గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఇతడిని ఆకట్టుకున్న వీరాస్వామి రొయ్యలు తోలకుండానే బిల్స్ తీసుకుని డబ్బులు ఇవ్వమని వేధించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా మృతుడు రామారావుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య వార్త తెలిసిన వెంటనే బంధువులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఘటనపై భీమవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
దారుణం.. మద్యం మత్తులో కన్నకొడుకుపైనే తల్లి పైశాచికం.. బ్లేడుతో…
పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. మనిషి బొమ్మ గీసి..వికృతంగా పసుపు, కుంకుమ చల్లి…